40.2 C
Hyderabad
May 1, 2024 16: 54 PM
Slider నల్గొండ

డి ఎస్ ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదానం  

#dsrtrust

హుజూర్ నగర్ నియోజకవర్గం లోని తిలక్ నగర్ కి చెందిన కుర్రి చెంబమ్మ క్యాన్సర్ తో బాధపడుతూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వైద్యులు అన్ని పరీక్షలు చేసి రక్తం అత్యవసరమని కుటుంబ సభ్యులకు తెలపటంతో వారు హుజూర్ నగర్ పట్టణంలోని డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు కి ఫోన్ చేసి చెప్పారు. వెంటనే స్పందించిన బాబురావు తిలక్ నగర్ కి చెందిన  ఇందిరాల ఉపేందర్ కి ఫోన్ చేసి విషయం చెప్పడంతో ఉపేందర్ తక్షణమే స్పందించి సూర్యాపేట పట్టణానికి వెళ్లి ‘బి’ నెగిటివ్  రక్తం సకాలంలో ఇచ్చారు.

ఈ సందర్భంగా డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ మరణ వేదనతో విలవిలలాడుతున్న ప్రాణాలను రక్షించు, ఆలస్యం చెయ్యకు, కోన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ప్రాణాలెన్నో అక్కడ క్షణాలు లెక్కపెడుతున్నారు, క్షణం ఆలోచించకుండా నువ్వు బయలుదేరి పరుగెత్తుకు వెళ్ళి రక్తదానం చెయ్యాలని ప్రాణ వాయువు అందక కొన ఊపిరితో తల్లడిలుతున్న ప్రాణాలను బతికించడం మన చేతులలోనే ఉందని మర్చిపోవద్దు మిత్రమా, పోయేదేముంది రక్తదానం చేసిన 2 రోజులకు తిరిగి తన శరీరంలోకి వచ్చే రక్తమే కదా,మనం రక్తదానం చేయకుంటే వెలకట్టలేని ప్రాణం పోతుందని బాబురావు అన్నారు.

దగ్గరలో ఉన్న రక్తనిధికి స్వచ్చందంగా వెళ్ళండి రక్తదానం చేసి పునర్జన్మను ప్రసాదించండని అన్నారు. డిఎస్ఆర్ ట్రస్ట్ తరఫున రక్తదానం చేసిన ఇందిరాల ఉపేందర్ కి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

శివోహం: సోమశిలలో మార్మోగిన శివనామ స్మరణ

Satyam NEWS

మొక్క‌లు నాటిన స‌మాచార హ‌క్కు క‌మిష‌న‌ర్ శ్రీ‌నివాస‌రావు

Satyam NEWS

టీడీపీ కూటమి అభ్యర్థుల విజయం ఖాయం

Satyam NEWS

Leave a Comment