38.2 C
Hyderabad
April 29, 2024 21: 42 PM
Slider నల్గొండ

జనచైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో పాత నేరేడుచర్ల లో రక్తదాన శిబిరం

#blooddonation

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోగల పాత నేరేడుచర్ల గ్రామంలో జనవరి 12న,స్వామి వివేకానంద జయంతి,జాతీయ యువజన దినోత్సవం, సంక్రాంతి పండుగ సందర్భంగా జన చైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా రక్తదాన శిబిర ఆర్గనైజర్ దేవిరెడ్డి నాగిరెడ్డి మాట్లాడుతూ అన్ని దానాలలోకెల్లా రక్తదానం ఎంతో విలువైనదని,రక్తం నిల్వలు తక్కువగా ఉండడం వలన ఎంతోమంది రక్తం అందక మృత్యువాత పడుతున్నారని,ప్రతి ఒక్కరూ తమ శక్తి కొలది వీలయినంత వరకు రక్తదానం చేయాలని కోరారు.

శనివారం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 50 మందికి పైగా రక్తదానం చేశారు.రక్త దాతలుగా నిలిచిన వారందరికీ, ఈ కార్యక్రమానికి సహకరించిన వారందరికీ జనచైతన్య ట్రస్ట్ అధ్యక్షుడు, సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో పాత నేరేడుచర్ల  గ్రామ యువత,పెద్దలు,జనచైతన్య ట్రస్ట్ సభ్యులు వంశీ,సాయి,శివశంకర్,రమేష్, శ్రీపతి,నవీన్,తిరుమల బ్లడ్ బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

లాక్ డౌన్ ఉన్నంతకాలం పేదలకు ఆహారం అందిస్తా

Satyam NEWS

కరోనా పేషెంట్ లపై నిర్లక్ష్య ధోరణి తగదు…

Satyam NEWS

6నెలల్లో సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా తెలంగాణ

Satyam NEWS

Leave a Comment