26.7 C
Hyderabad
April 27, 2024 10: 06 AM
Slider ఆదిలాబాద్

కరోనా పేషెంట్ లపై నిర్లక్ష్య ధోరణి తగదు…

#soyambapurao

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని… కరోన వ్యాధిగ్రస్తుల కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ అజమాయిషీ లోపించి రోగులు అవస్థలు పడుతున్నారని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు అన్నారు.

సోమవారం covid 19 రెండో డోసు వ్యాక్సిన్ ను ఎంపీ తీసుకున్నారు.  ఈ సందర్భంగా అదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి .. నియంత్రణకు తీసుకుంటున్న చర్యల గురించి రిమ్స్ డైరెక్టర్ బలరాం.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ నరేందర్ తో ఎంపి సమీక్షించారు.

ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో సామాన్యులకు సరైన వైద్యం అందడం లేదని ముఖ్యంగా అత్యవసర రోగులకు ఇవ్వాల్సిన  రెమిడిస్వీర్ ఇంజక్షన్లు ఇవ్వడం లేదని రోగుల అవస్థలు పట్టించుకోవడం లేదని ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం ఓ వైపు కరోనా నియంత్రణకు వేల కోట్లు ఖర్చు చేస్తూ రెండు డోసులు టీకాలను ఉద్యమంల నిర్వహిస్తుందని ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశమంతటా కరుణ వ్యాధి నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

Related posts

చీకట్లు అలుముకున్న రాజధాని ప్రాంతం రోడ్లు

Satyam NEWS

శ్రీశైలం లో అత్యంత వైభవంగా దసరా మహోత్సవాలు

Satyam NEWS

The Power House: కరెంటు కష్టాలకు చరమగీతం  పాడిన రాష్ట్రం

Satyam NEWS

Leave a Comment