38.2 C
Hyderabad
April 29, 2024 19: 25 PM
Slider కరీంనగర్

జగిత్యాల పోలీసుల రక్తదాన శిబిరం

#jagityalapolice

పోలీస్‌ అమరవీరుల సంస్మరణ లో భాగంగా అమరవీరుల త్యాగలను స్మరిస్తూ జగిత్యాల జిల్లా పోలీస్ ల అధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను జిల్లా ఎస్పీ  సింధు శర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రకాష్, వివిధ సర్కిళ్ల సి. ఐ లు ఎస్.ఐ మరియు పోలీస్ సిబ్బంది, యువత స్వచ్ఛంద రక్తదానం చేశారు. సుమారు 150 యూనిట్ల బ్లడ్ ను రెడ్ క్రాస్ సొసైటీ వారు సేకరించింది.

ఈ సందర్భంగా ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ పోలీస్  అమరవీరులు సమాజం కోసం, దేశం కోసం, రేపటి  తరాల మంచి భవిష్యత్తు కోసం ప్రాణత్యాగాలు చేశారని వారి త్యాగాలను వెలకట్టలేమన్నారు. ప్రతీ ఒక్కరూ అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకోవాలన్నారు. అమరుల త్యాగ ఫలంగానే ఈరోజు దేశం, రాష్ట్ర ప్రజలందరూ శాంతియుతంగా, ప్రశాంతంగా ఉన్నారన్నారు. మెరుగైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా పని చేసినప్పుడే అమరుల త్యాగానికి నిజమైన నివాళి అని తెలిపారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ ప్రతిఏటా పోలీస్ ప్లాగ్ డే ని నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు.

ఆపదలో ఉన్న ప్రాణాలు రక్షించడానికి రక్తం ఎంతో ఉపయోగపడుతుందని ఆరోగ్యంగా ఉండే ప్రతి మనిషి  రక్తదానం చేయాలని సూచించారు. ఈ యొక్క రక్తదాన శిబిరంలో పాల్గొని బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ తరపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు ప్రకాష్, రవీంద్ర రెడ్డి, సీ.ఐలు కిషోర్, కృష్ణకుమార్, రమణమూర్తి, కోటేశ్వర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, వామనమూర్తి, నవీన్ మరియు ఎస్.ఐ  లు, ఇండియన్ రెడ్ క్రాస్ సోసైటీ జిల్లా కార్యదర్శి మంచాల కృష్ణ, సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, TV సూర్యం, పోలీస్ సిబ్బంది, యువత,  పాల్గొన్నారు.

Related posts

వనపర్తి జిల్లాలో అటవీ భూముల పరిరక్షణకు చర్యలు

Satyam NEWS

డాక్టర్ జిఎస్ఎన్ రాజు ఆధ్వర్యంలో అశ్విన్స్ స్పెషాల్టి ఆస్పత్రి

Satyam NEWS

విద్యుత్ శాఖ నిర్లక్ష్యానికి పంజుగుల రైతు మృతి

Satyam NEWS

Leave a Comment