40.2 C
Hyderabad
April 28, 2024 16: 56 PM
Slider ప్రత్యేకం

వనపర్తి జిల్లాలో అటవీ భూముల పరిరక్షణకు చర్యలు

#niranjanreddy

వనపర్తి జిల్లాలో అటవీ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకున్నట్టు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు  ఆదివారం వనపర్తి ఆర్డీఓ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, అఖిలపక్ష నాయకులతో కలిసి అటవీ భూముల పరిరక్షణకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 531770.781 ఎకరాల విస్తీర్ణం ఉందని, ఇందులో 28343.44 ఎకరాల అటవీ విస్తీర్ణం ఉందన్నారు.

జిల్లాలో మొత్తం 24 అటవి బ్లాకులు ఉన్నాయని, 6 మండలాల్లో అటవీ ఆక్రమణలు ఉన్న గ్రామాలు 36, వాటిలో అటవీ ఆక్రమణలో ఉన్న వారి సంఖ్య 970, ఆక్రమణలో ఉన్న అటవీ విస్తీర్ణం 2378. 33 ఎకరాలు ఉందన్నారు. ఇందులో ప్రధమంగా పోడు రైతుల సమస్యలు పరిష్కరించడానికి తెలంగాణ ప్రభుత్వం 08″ నవంబర్ నుండి 08 డిసెంబర్ వరకు క్లెయిమ్స్ తీసుకుంటుందని  చెప్పారు. RoFRచట్టం 2005 ప్రకారం, అర్హత కలిగిన ప్రతి పోడు రైతుకు RoFRపట్టా ఇవ్వడం జరుగుతుందని, ఈ సమస్య పరిష్కరించి, అర్హులైన ప్రతి పోడు రైతుకు RoFR పట్టా ఇచ్చిన తర్వాత ఒక్క అంగుళం ఫారెస్ట్ భూమి కూడా, ఆక్రమణ కాకుండ చూడవలసిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల పైన,

ప్రజల పైన ఉందని తెలిపారు. జిల్లాలో అటవీ భూముల సర్వేకు రెవెన్యూ శాఖ చర్యలు తీసుకుంటుందని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అటవీ భూములను పరిరక్షించేందుకు సర్వే చేయడానికి అవసరమైతే పోలీసు శాఖ సహాయం తీసుకుంటుందని అన్నారు. అటవీ భూములను ఎవరైనా ఆక్రమిస్తే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. సర్వే సమయంలో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ తీయాలని ఆదేశించారు. ఇందుకు బాధ్యత కలిగిన

రాజకీయ పార్టీల ప్రతినిధులు అంగీకరిస్తూ, ఇక మీద ఒక్క అంగుళం ఫారెస్ట్ భూమి కూడా ఆక్రమణ కాకుండ చూస్తామని జిల్లా రాజకీయ పార్టీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీ అపూర్వరావు,  అదనపు కలెక్టర్లు వేణుగోపాల్, లోకల్ బాడీ ఆశిష్ సంగ్వ న్, చీఫ్ కన్జర్వేటర్ శృతి ఓజా, తహసిల్దార్ రాజేందర్ గౌడ్, జిల్లా  ఫారెస్ట్ ఆఫీసర్ రామకృష్ణ, సిపిఎం పార్టీ ప్రతినిధులు ఎండి జబ్బార్, ఆంజనేయులు, బి ఎస్ పి తరపున కృష్ణ, బిజెపి నుండి వెంకటేశ్వర్ రెడ్డి, సిపిఐ చంద్రయ్య, టిడిపి నుండి రాములు, జడ్పీటీసీలు భార్గవి, వెంకటేశ్వరమ్మ,శ్రీరంగాపురం రాజేంద్రప్రసాద్ యాదవ్,మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, జడ్పి కోఆప్షన్ సభ్యుడు పానగల్ మునీరుద్దీన్, ఎంపీపీ శంకర్ రెడ్డి, నాయకులు కోళ్ల వెంకటేష్, జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

రాహుల్ గాంధీ భద్రతలపై కాంగ్రెస్ ఆందోళన

Satyam NEWS

డిబేటబుల్: సంచయిత అసుసరిస్తున్న మతం ఏది?

Satyam NEWS

వ‌ర‌ల్డ్‌క‌ప్ ఫైన‌ల్లో ఆసీస్‌.. సెమీస్‌లో సౌతాఫ్రికాపై విజ‌యం

Satyam NEWS

Leave a Comment