31.7 C
Hyderabad
May 2, 2024 10: 42 AM
Slider శ్రీకాకుళం

సమగ్ర శిక్ష లో ఇంకా బ్రిటిష్ పరిపాలన విధానం

srikakulam

రాష్ట్రంలో సమగ్ర శిక్ష లో రాష్ట్ర విద్యా శాఖ అధికారులు ఒప్పంద, పొరుగు సేవల లో ఉద్యోగస్థుల జీతాల పెంపు విషయంలో బ్రిటిష్ పరిపాలన విధానం అనుసరిస్తున్నారని రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గణపతి జగదీశ్వర రావు అన్నారు.

శ్రీకాకుళం గ్రామీణ మండలం లో గల కిల్లి పాలెం గ్రామంలో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. సమగ్ర శిక్ష లో ఒప్పంద పొరుగు సేవలలో పనిచేస్తున్న సి ఆర్ పి లు, ఎం ఐ ఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఎకౌంట్లో, మెసెంజర్ లకు తాజాగా 5000 రూపాయలు జీతం పెంచారని ఆయన అన్నారు.

మిగతా విభాగాల్లో పనిచేస్తున్న కేజీబీవీ పనిచేస్తున్న ఒప్పంద ఉపాధ్యాయులకు ప్రత్యేక అధికారులు, కేజీబీవీ ఇంటర్మీడిట్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులకు, కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న పొరుగు సేవల లో పనిచేస్తున్న ఆఫీసు సిబ్బంది, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆర్ట్, క్రాఫ్ట్ ,వ్యాయామ ఉపాధ్యాయులకు సమగ్ర శిక్ష ప్రాజెక్టు కార్యాలయంలో పనిచేస్తున్న సైట్ ఇంజనీర్ లు,కంప్యూటర్ ఆపరేటర్ లో, ఎకౌంట్లో, నైట్ వాచ్ మెన్, ఆఫీస్ సబార్డినేట్ లకు జీతాలు పెంచలేదని అన్నారు.

విభజించి పాలించి అనే రీతిలో రాష్ట్ర సమగ్ర శిక్ష అధికారులు సర్వశిక్ష ప్రాజెక్టు విషయంలో అనుసరిస్తున్నారని ఆయన అన్నారు. సమగ్ర శిక్షా రాష్ట్ర అధికారులు కొన్ని విభాగాలకు మాత్రమే జీతాలు పెంచి, మరి కొన్ని విభాగాలకు విస్మరించడం అన్యాయమని పేర్కొన్నారు.

ఈ జీతాల పెంపుదల కొన్ని విభాగాలుగా పరిమితం చేయడంపై బ్రిటిష్ పరిపాలన విధానం గుర్తుకు వస్తుందని తెలిపారు. దీనిపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచించి సమగ్ర శిక్ష లో పనిచేస్తున్న  మొత్తం ఒప్పంద , పొరుగు సేవల లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరికీ జీతాలు పెంచాలని కోరారు.

Related posts

వేములవాడ వాసుల బతుకమ్మ సంబురాలు

Satyam NEWS

చంద్రబాబు, లోకేష్‌ భద్రతకి ముప్పు..?

Bhavani

అంధులకు విద్యాదానం చేసిన పోరెడ్డి రోసమ్మ సంకల్పం గొప్పది

Satyam NEWS

Leave a Comment