జాతీయ రహదారి పై స్కూటీ ని రెడీ మిక్స్ లారీ ఢీ కొనడంతో అక్కాతమ్ముడు అక్కడికక్కడే మరణించిన దారుణమైన సంఘటన ఇది. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం బస్ స్టాప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన సుష్మాలత, సాయి తేజ ఈ ప్రమాదంలో మరణించారు.
అక్కా, తమ్ముడు పనిమీద మీ సేవ కు వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. మృతుల తల్లి, దండ్రులు పుట్టిన ఇద్దరు పిల్లలు చనిపోవడంతో బోరున విలపించారు. వారిని అమీన్ పూర్ వాసులు గా గుర్తించిన పోలీస్ లు కేస్ నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
డీ కొట్టి పారిపోతున్న రెడీ మిక్స్ లారీ ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రమాదం జరిగిన స్థలం నుండి భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పోలీసులు మృతుల డెడ్ బాడీ లను పోస్ట్ మార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రి తరలించారు.