38.2 C
Hyderabad
April 29, 2024 14: 59 PM
Slider ఆధ్యాత్మికం

సూర్య గ్రహణం లో అయ్యప్ప స్వాములకు సూచన

sabarimala 24

ఈ నెల 26న గురువారం మూలా నక్షత్రంలో ధనస్సు రాశి లో కేతు గ్రస్త కంకణాకార సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం (స్పర్శ కాలం) ఉ. 8.11 నుంచి ఉంటుంది. (మోక్ష కాలం) ఉ.11.20 లకు పూర్తి అవుతుంది. గ్రహణం కారణంగా 25 వ తేదీ సాయంత్రం 7.00 గంటల లోపు మీ సన్నిధానాల్లో పూజలు ముగించుకోవాలి.

రాత్రి 8.00 లోపు అల్పాహారం చేసుకోవాలి. ఫోటో లపై దర్భ వేసి ఉంచాలి. 26 ఉదయం పూజాదికాలు ఉండవు. దీక్ష స్వాములు ఉ.8.15.ని.లకు గ్రహణం పట్టు సమయంలో పట్టు స్నానం ఆచరించాలి. అదే విధంగా గ్రహణం విడిచే వరకు అనగా ఉ.11.24. ని..వరకు మీ ఇష్ట దైవాన్ని జపించాలి. లేదా గురువు ఉపదేశించిన మంత్రాన్ని జపించాలి.

గ్రహణం విడిచిన అనంతరం విడుపు స్నానం ఆచరించి ఇంటిని, విరిని శుద్ధి చేసుకోవాలి. ఈ తరువాత పీఠం మాల ముద్రని ఇంట్లో పూజించే విగ్రహాలను ఆవుపాలతో శుద్దిచేసి పూజ చేయాలి. ఆ తర్వాత భిక్ష స్వీకరించాలి.

Related posts

రాజధాని ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వైసీపీ కుట్ర

Satyam NEWS

కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నాం

Satyam NEWS

మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్

Satyam NEWS

Leave a Comment