ఫేక్ ఆధార్ కార్డు తయారు చేసుకుని అక్రమంగా భారత్ లో నివశిస్తున్న మయన్మార్ దేశస్థుడిని నేడు హైదరాబాద్ లోని కంచన్ బాగ్ పోలీసులు అరెస్టు చేశారు. రహీమ్ ఉల్లా అనే 34 ఏళ్ల బర్మా దేశస్థుడు పది సంవత్సరాల కిందట హైదరాబాద్ పాత బస్తీకి వచ్చాడు.
పాతబస్తీలోని బాబా నగర్ లోని బి బ్లాక్ లో అతను అక్రమంగా నివశిస్తున్నాడు. పోలీసు సమాచార వ్యవస్థ ద్వారా ఈ విషయాలను కంచన్ బాగ్ పోలీసులు తెలుసుకున్నారు.
దాంతో కంచన్ బాగ్ పోలీసులు అతని ఇంటిపై దాడి చేశారు. అతడి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేయగా అక్కడ వారికి నకిలీ ఆధార్ కార్డు దొరికింది. అతని కుటుంబానికి కూడా ఆధార్ కార్డులు, ఓటరు ఐడి కార్డులు ఉన్నాయా అనే విషయాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు.