34.2 C
Hyderabad
May 14, 2024 21: 16 PM
Slider విజయనగరం

విజయనగరంలో సామాజిక సాధికార బస్సు యాత్ర

#kolagatla

భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీతో మద్దతు పలికిన ఉప సభాపతి కోలగట్ల

రాష్ట్రంలో సీఎం జగన్ పాలనలోనే సామాజిక న్యాయం సాధ్యమైందని.. ఇది ప్రజలకు తెలియజెప్పేందుకే బస్సు యాత్ర చేపడుతున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. 2014 ఎన్నికల్లో 600కు పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు.. ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేశారని, ఆయన నయవంచకుడని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర శుక్రవారం ఉదయం విజయనగరానికి చేరుకుంది.

ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బూడి ముత్యాలునాయుడు, మంత్రి మేరుగు నాగార్జున, మాజీ మంత్రి పుష్పశ్రీవాణి, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్టీ నాయకులతో కలిసి బొత్స మాట్లాడారు. ఈ నెల 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల నుంచి సామాజిక సాధికార యాత్రను ప్రారంభించామన్నారు.

సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనలో ఏ విధంగా సామాజిక న్యాయం చేశారన్నది ప్రజలు తెలియజేప్పేందుకు బస్సు యాత్రను ప్రారంభించామన్నారు. నాలుగున్నరేళ్లుగా ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. మొదటి రోజు బస్సు యాత్రను ప్రజలు విజయవంతం చేశారని తెలిపారు. చంద్రబాబు మాదిరిగా మోసం చేయడం, వంచించడం ఈ ప్రభుత్వానికి అలవాటు లేదన్నారు. సీఎం జగన్‌ తండ్రి వైఎస్సార్‌ ఆశయాలను, ఆలోచనలను పుణికిపుచ్చుకున్నారని గుర్తు చేశారు.

మాట తప్పని నాయకుడు జగన్‌ అని తెలిపారు.  టీడీపీది మాట తప్పిన పార్టీ అని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాలను గత ప్రభుత్వం మోసం చేసిందన్నారు. తాము ఈ నాలుగున్నరేళ్లలో ఎలా పాలించామో ప్రజలకు వివరిస్తున్నామన్నారు. టీడీపీ చేసిన వంచన, అవినీతిని ఎండగడుతున్నామన్నారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌, బీజేపీ నాయకత్వం ఎలా వాగ్ధానాలు చేసిందో అందరికీ తెలుసు అన్నారు. ‘‘600 వాగ్ధానాలు వారి మేనిఫెస్టోలో పెట్టారు. చంద్రబాబు సీఎం అయ్యాక మొదటి రోజు ఐదు సంతకాలు చేశారు.

వాటిలో ఒక్కటి కూడా నెరవేర్చకుండా మోసం చేశార’’న్నారు. 87 వేల కోట్లు రైతు రుణాలు మాఫీ చేస్తానని నట్టేట ముంచారని, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని దగా చేశారని విమర్శించారు. బెల్ట్‌ షాపులు రద్దు చేస్తామని చెప్పి విచ్చలవిడిగా మద్యాన్ని ఏరులై పారించారన్నారు. మళ్లీ తగుదునమ్మా అంటూ ఎన్నికల సమయంలో వస్తున్నారని.. ఇలాంటి వంచకుల మాటలు నమ్మాలా? అని ప్రశ్నించారు. ప్రజల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచిన సీఎం జగన్‌ విధానం, అభిమతం, ఆయన లక్షణం, ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నైజాన్ని ప్రజలకు వివరించేందుకు బస్సు యాత్ర ద్వారా బయలుదేరామన్నారు.

గతంలో విజయనగరం జిల్లాను టీడీపీ ఎలా మోసం చేసిందో ప్రజలక వివరిస్తున్నామన్నారు. సామాజిక సాధికార యాత్రను విజయవంతం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ కోరారు. చంద్రబాబు ఎన్ని లేఖలైనా రాసుకోవచ్చని, చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. చంద్రబాబు తప్పు చేయకపోతే కోర్టు ఎందుకు రిమాండుకు పంపిందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఆయనకు శిక్ష వేయలేదన్నారు.

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బూడి ముత్యాలునాయుడు మాట్లాడుతూ  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం, సీఎం జగన్‌ అందించిన సంక్షేమ పథకాలను సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌ విప్లవాత్మక మార్పులు తెచ్చారని, నాడు`నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారన్నారు. అవినీతికి చోటు లేకుండా సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందించామన్నారు. వెనుకబడిన వర్గాలకు ఆర్థిక చేయూతనందించారన్నారు. సమన్యాయంతో అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. సామాజిక సాధికారత అనే మాటకు జగన్‌ కట్టుబడి ఉన్నారని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాలు, మెడికల్‌ కాలేజీల ఏర్పాటు, పరిశ్రమల ఏర్పాటుతో అనేక మంది ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో బస్సు యాత్ర ద్వారా బహిరంగ సభలు ఏర్పాటు చేసి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో సామాజిక విప్లవం విరాజిల్లుతోందని మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. చేసిన అభివృద్ధిని ప్రతీ ఒక్కరికీ వివరించడమే బస్సు యాత్ర ఉద్దేశమన్నారు. సంక్షేమ పాలనను అందిస్తున్న ముఖ్యమంత్రికి ప్రజలు అండగా నిలుస్తున్నారని మాజీ మంత్రి పుష్పశ్రీవాణి తెలిపారు. పేద,బడుగు, బలహీన వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడే విధంగా జగన్‌ నిర్ణయాలు, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయన్నారు. 2.83 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో బటన్‌ నొక్కి జమ చేశారన్నారు.

ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు. గతంలో ఎస్సీలను, ఎస్టీలను చంద్రబాబు అవమానించారని.. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశారని గుర్తు చేశారు. నేడు జగన్‌ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారని తెలిపారు. సుమారుగా 75 శాతం నిధులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికే ఖర్చు చేశారన్నారు. ఈ రోజు కేబినెట్‌లో 18 మంది ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలు మంత్రులుగా ఉన్నారని.. ఇదీ సామాజిక న్యాయమంటే అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ వైవీ సుబ్బారెడ్డి, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, పార్లమెంట్‌ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్‌, శాసనసభ్యులు శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు, అలజంగి జోగారావు, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, కంబాల జోగులు, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్‌ బాబు, మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులు పరీక్షిత్‌ రాజు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, నాయకులు పాల్గొన్నారు.

విజయనగరంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ

విజయనగరం చేరుకున్న సామాజిక సాధికార బస్సు యాత్రకు నియోజకవర్గంలో అపూర్వ ఆదరణ లభించింది. బస్సు యాత్రకు మద్దతుగా స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీని తన నివాసం వద్ద నుంచి కోలగట్ల జెండా ఊపి ప్రారంభించారు. వందలాది ద్విచక్ర వాహనాలతో  బస్సు యాత్రతోపాటు అంబేడ్కర్‌ కూడలి, ఆర్టీసీ కాంప్లెక్స్‌, ఆర్‌అండ్‌బీ, కలెక్టరేట్‌ మీదుగా గొట్లాం వరకూ ర్యాలీ సాగింది. జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు సంగంరెడ్డి బంగారునాయుడు, జి.ఈశ్వర్‌ కౌశిక్‌, ఇతర యువజన విభాగం నాయకులు, కార్పొరేటర్లు స్వయంగా బండి నడుపుతూ ర్యాలీలో ముందుకు సాగారు. అనంతరం గొట్లాం నుంచి బస్సు యాత్ర గజపతినగరం బయల్దేరింది.

Related posts

జర్నలిస్ట్ శివ కు బూతుల పంచ్ ప్రభాకర్ వార్నింగ్

Satyam NEWS

నెఫ్ట్ ద్వారా ఇక 24 గంటలూ నగదు బదిలీ చేసుకోవచ్చు

Satyam NEWS

ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 బీసీలకే

Bhavani

Leave a Comment