29.7 C
Hyderabad
May 2, 2024 03: 25 AM
Slider ముఖ్యంశాలు

కరోనాతో చస్తున్నా వ్యాపారం వదలని నారాయణ

narayana

ప్రపంచం మొత్తం కరోనా వచ్చి చస్తుంటే ఈ నారాయణ కు మాత్రం వ్యాపారంపై దృష్టి సడలడం లేదు. సీబీఎస్ఈ లో పదో తరగతి పూర్తి అయిపోయిన వారికి 11వ తరగతిలో చేర్చుకోవడానికి అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించారు.

దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో, ఎప్పుడు కరోనా అంతం అవుతుందో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో నారాయణ మాత్రం తన వ్యాపారాన్ని ఆపడంలేదు. ఎన్ శాట్ (నారాయణ స్కాలస్టిక్ ఆప్టిట్యూడ్ టెస్టు) పేరుతో ఈ పరోక్ష వ్యాపారానికి తెరతీశారు.

ఈ నెల 10, 15 తేదీలలో ప్రవేశ పరీక్ష ఉంటుందట. ఆ పరీక్ష రాస్తే బాగా మార్కులు వచ్చిన వారికి స్కాలర్ షిప్ ఇస్తారట. అంటే అడ్మిషన్ల ప్రక్రియ మొదలు పెట్టినట్లే. పరీక్షలు పెట్టే అవకాశం లేని పరిస్థితుల్లో సీబీఎస్ ఈ బోర్డు విద్యార్ధుల్ని తర్వాతి తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

స్టేట్ సిలబస్ లో పరీక్షలు నిలిచిపోయి భవిష్యత్తు అగమ్య గోచరంగా మారి ఉన్న ఈ సమయంలో ఇలా వ్యాపారాలు చేసుకోవడం తెలివితేటలా? అతి తెలివితేటలా? మంత్రిగా కూడా పని చేసిన నారాయణకు ఆ మాత్రం సామాజిక బాధ్యత లేదా? ఈ ఆపత్ సమయంలో కూడా డబ్బులు సంపాదించాలన్న యావేనే?

ఏమి ఈ దరిద్రపు ఆలోచన? ఎందుకు ఈ కక్కుర్తి? లాక్ డౌన్ ఎత్తేస్తారో లేదో అనే సమస్యతో సతమతం అవుతున్న తల్లిదండ్రులు ఈ నారాయణ పెట్టే పరిక్షగురించి ఎలా ఆలోచించాలి? ఉద్యోగాలు ఉంటాయో లేదో, అసలు తిండి దొరుకుతుందో లేదో అని ఆలోచిస్తున్న సమయంలో వీళ్ల వ్యాపారం జుగుప్స కలుగుతున్నది.

Related posts

దొంగ పాదయాత్రలు ఆపి ప్రజలకు సేవ చేయండి

Satyam NEWS

చిరంజీవి సినిమాను ఎత్తేసిన ధియేటర్ ఎదుట ఆందోళన

Satyam NEWS

గద్వాలలో శ్రీ రాఘవేంద్ర స్వామి 428 వ వర్ధంతి

Satyam NEWS

Leave a Comment