40.2 C
Hyderabad
April 28, 2024 17: 20 PM
Slider ప్రత్యేకం

కాప్రా మునిసిపాలిటీలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ

#kapralionsclub

చిన్న పిల్లల క్యాన్సర్, మహిళల  బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కలిగిస్తూ లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ (జిల్లా 320C) ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా కాప్రా మునిసిపాలిటీలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా సేవా సమన్వయ కర్త లయన్ మనోహర్ రెడ్డి, ఆధ్వర్యంలో లీడ్ రీజియన్ ఛైర్పసన్ లయన్ మనోజ్ కుమార్ డి. యస్. లయన్ జెయంత్ సింగీ  కోఆర్డినేషన్ తో సోమవారం కాప్రా మున్సిపల్ ఆఫీసు నుండి  రాధిక చౌరస్తా వరకు ర్యాలీ జరిగింది.

సుమారు 250 మహిళలు, యువతులు, విద్యార్ధులు, లయన్ నాయకి నాయకులతో పాంప్లెట్స్ పంచుతూ ర్యాలీ నిర్వహించారు.  దానికి ముందు క్యాన్సర్ స్పెషలిస్ట్ అపోలో హస్పిటల్ డాక్టర్ ఆషిష్ చౌహాన్  ద్వారా సలహాలు, సూచనలు ఇస్తూ అవగాహన కల్పించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గవర్నర్ లయన్ ఆవుల  గోపాలరావు, మెంటార్ లయన్ డాక్టర్  జి యస్ ప్రహ్లాద్ , పిడిజలు లయన్ ఏ లింగా రెడ్డి, లయన్  పి రవింద్రనాద్ గుప్త, హేమాద్రి రావు, రామారావు, పవనీ మహిపాల్ రెడ్డి, కొత్త రామారావు మరియు ఇతర ముఖ్య లయన్ నేతలు పాల్గొనడం జరుగింది. ప్రజలు అధిక సంఖ్యలో ముందుకి వచ్చి  ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు. లయన్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నిన్నటి నుండి వారం రోజుల పాటు ప్రతి రోజూ జిల్లా320సి ఆద్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అందులో బాగంగా రేపు పర్యావరణ పరిరక్షణ గురించి అవగాహన ర్యాలీ, మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం, అలాగే 13న డయాబెటిస్ ఆవగాహన ర్యాలీ రక్త పరీక్షలు ఇసిసీల్ బస్సు స్టాప్ లొ నిర్వహింస్తామని అన్నారు. అన్ని కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నామన్నారు.

Related posts

కేసీఆర్ ఐడియాను కాపీ కొట్టిన జగన్

Bhavani

ఇంకా అలక వీడని రాహుల్ గాంధీ

Satyam NEWS

వి ఎస్ యూ లో ఘనంగా బాలికల దినోత్సవం

Bhavani

Leave a Comment