33.7 C
Hyderabad
April 29, 2024 01: 09 AM
Slider ప్రత్యేకం

కేసీఆర్ ఐడియాను కాపీ కొట్టిన జగన్

#KCR

తెలంగాణ సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడిచి రెండో సారి విజయం సాధించాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు రకాల ఆలోచనలు చేస్తున్నారు. తెలంగాణ లో కేసీఆర్ ఎన్నికల ఎత్తుగడలు వేయడంలో తనదైన శైలిలో పని చేస్తుంటారు. తెలంగాణ లో కేవలం ఒక్క సీటుకే పరిమితం అయిన బీజేపీని విపరీతంగా పెంచడం ద్వారా రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముక్కోణపు పోటీ జరిగేలా చూడాలని కేసీఆర్ ప్లాన్ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తనకు ప్రధాన శత్రువు అనే విషయం తెలిసినా కూడా కాంగ్రెస్ ను విస్మరించి బీజేపీని విమర్శించే విధంగా ప్లాన్ చేసి తన వ్యూహాన్ని కేసీఆర్ విజయవంతంగా అమలు చేశారు. బీజేపీని అతి తీవ్రంగా విమర్శించడం, బీజేపీ పై దాడులు చేయించడం తదితర చర్యలతో ఉద్రిక్తతలు పెంచిన కేసీఆర్ బీజేపీని తెలంగాణ రాష్ట్రంలో అమాంతం పెంచేశారు.

బీజేపీ ఇక అధికారంలోకి రావడమే తరువాయి అన్నట్లు ప్రవర్తించింది. అయితే బీజేపీకి వాతావరణం సహకరించలేదు. ఎంత త్వరగా ఎదిగిందో అంత త్వరగా పతనమైపోయింది. ఇప్పుడు తెలంగాణ లో బీజేపీ కకావికలం అయిపోంది. బీజేపీ పూర్తి స్థాయిలో విజృభించిన కాలంలో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయింది.

విధి వక్రీకరించిన బీజేపీ తన స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయింది. కేసీఆర్ కల్పించిన అవకాశాన్ని లబెట్టుకోలేకపోయింది. దాంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్లీ పుంజుకున్నది. కేసీఆర్ ను పడగొట్టి అధికారంలోకి వచ్చేస్తామని కాంగ్రెస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఆడిన నాటకం రక్తి కట్టేలేదు కానీ కొంత కాలం పాటు మాత్రం తెలంగాణ లో ముక్కోణపు పోటీ జరుగుతుందని ప్రజలు భావించారు. ఈ ముక్కోణపు పోటీ వల్ల కేసీఆర్ మళ్లీ గెలుస్తారని కూడా అందరూ అనుకున్నారు. ఇప్పుడు పరిస్థితి తలకిందులై మళ్లీ కాంగ్రెస్ గెలుస్తుందనే టాక్ మొదటైంది.

ఇంతకీ చెప్పవచ్చేదేమంటే తెలంగాణ లో కేసీఆర్ చేసిన మాదిరిగా ఏపిలో మూడో శక్తిని బాగా పెంచాలని జగన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. మూడో శక్తి అంటే అక్కడ బీజేపీ లేదు కాబట్టి ఆయన పవన్ కల్యాణ్ పార్టీ అయిన జనసేన పెరగాలని కోరుకుంటున్నారట. అందుకోసం పవన్ కల్యాణ్ పైనే విమర్శలు ఎక్కువ చేయాలని తన పార్టీ సోషల్ మీడియాకు ఆదేశాలు ఇచ్చారని అంటున్నారు.

తన సోషల్ మీడియా సైన్యం ద్వారా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయడం ద్వారా జనసేన పార్టీ విశేషంగా బలపడినట్లుగా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఏపిలో పని చేస్తున్న వాలంటీర్ల వ్యవస్థ ను పవన్ కల్యాణ్ విమర్శించడంతో దాన్ని ఆసరాగా చేసుకుని పేటీఎం బ్యాచ్ తో సోషల్ మీడియాలో జగన్ దాడి పెంచేశారు.

పవన్ కల్యాణ్ ను దత్తపుత్తుడు అంటూ విమర్శించి ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ విసిరి రెచ్చగొట్టాలని జగన్ రెడ్డి విశ్వప్రయత్నం చేశారు. అయితే ప్రతిపక్షాల ఓటు చీలనివ్వను అని మాత్రమే ఇంత కాలం చెప్పిన పవన్ కల్యాణ్ తాజాగా ‘‘ జగన్ రెడ్డిని పదవి నుంచి దించడమే నా లక్ష్యం’’ అంటూ విస్పష్టంగా ప్రకటించేశారు. తాను దత్తపుత్రుడు అంటూ విమర్శిస్తే సున్నిత మనస్కుడైన పవన్ కల్యాణ్, రాజకీయ వ్యూహం వదిలేసి ఒంటరిగా పోటీ చేస్తారని జగన్ రెడ్డి భావించారు. అయితే రాజకీయ వ్యూహానికి మరింత పదును పెట్టిన పవన్ కల్యాణ్ వారాహీ యాత్రతో దుమ్ము దులిపేస్తున్నారు.

దాంతో తెలంగాణ లో కేసీఆర్ వ్యూహాన్ని అమలు చేసి పవన్ కల్యాణ్ ను అమాంతం తన ప్రత్యర్థి ఇతనే అని చెప్పేందుకు జగన్ రెడ్డి సేన సమాయత్తం అయిందట, తాము చేసే ప్రచారం చూపి తన బలం పెరిగిందని పవన్ కల్యాణ్ అనుకోవాలనేది జగన్ రెడ్డి వ్యూహం. తన బలం పెరిగిందని భావించి పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీకి దూరంగా జరగాలని జగన్ రెడ్డి కోరిక. ఈ మేరకు జగన్ రెడ్డి సోషల్ మీడియా పవన్ కల్యాణ్ పై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నది.

పవన్ కల్యాణ్ వ్యక్తిగత వివరాలను, కొందరు మహిళల ఫొటోలను బయటకు తీసుకువచ్చి సోషల్ మీడియాలో విస్త్రతంగా ప్రచారం చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ పేరుతో వైసీపీ సోషల్ మీడియా పవన్ కల్యాణ్ ను దారుణంగా టార్గెడ్ చేస్తున్నది. ప్రతి విషయంలో మైండ్ గేమ్ ఆడే జగన్ రెడ్డి….. పవన్ కల్యాణ్ ను రెచ్చగొట్టడం అనే తాజా మైండ్ గేమ్ ను ప్రారంభించారు.

Related posts

కట్టమైసమ్మ ఆలయంలో బిఎల్ఆర్ ప్రత్యేక పూజలు

Satyam NEWS

సాఫ్ట్‌వేర్ శార‌దకు టీటా రాష్ట్ర నాయకత్వంలో స్థానం

Satyam NEWS

తక్షణమే 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలి

Satyam NEWS

Leave a Comment