ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కామేపల్లి వల్లాయి కుంటలో కి ఒక కారు దూసుకుపోయింది. అయితే కుంట సగానికే నీళ్లు ఉండటం తో ప్రాణాపాయం తప్పింది. ప్రమాదం జరిగే సమయానికి ముగ్గురు వ్యక్తులు కారులో ఉన్నారు.
స్థానికుల సహాయం తో కారులో నుండి ఆ ముగ్గురు వ్యక్తులు బయటపడ్డారు.
కనిగిరి వివాహానికి వెళ్ళి తిరిగి మిట్టపాలెం వస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకున్నది. ఎటువంటి ప్రాణ హాని జరగక పోవడం తో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.