29.7 C
Hyderabad
May 3, 2024 03: 49 AM
Slider గుంటూరు

కరోనా విషయం లో భయబ్రాంతులకు లోను కావద్దు

Guntur Jt collector

రోడ్డు సేఫ్టీ-యన్. జి. ఓ సంస్థ తయారు చేసిన కరోనా వైరస్ రాకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తో కూడిన గోడ పత్రికలను గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కరోనా విషయం లో భయబ్రాంతులకు లోను కావద్దని కోరారు.

ప్రజలు వ్యక్తిగత శ్రద్ధ పాటించాలని, తరచూ చేతులు సబ్బు నీటితో శుభ్రం చేసుకోవాలని ఆయన అన్నారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటిని, ముక్కుని శుభ్రమైన చేతిరుమాలు పెట్టుకోవాలి అని దినేష్ కుమార్ చెప్పారు. ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేయకండి.

ఇంటికి వెళ్లి న తర్వాత వేడినీటితో స్నానం చేయడం మంచిది అని ఆయన చెప్పారు. విదేశాల నుండి వచ్చిన వారు ఏదైనా, ఎక్కువ జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోడం ఇబ్బoదిగా ఉన్నవారి వివరాలు వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రానికి సమాచారం అందించాలని ఆయన కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని ఈరోజు వరకూ మనరాష్ట్రo లో ఒక్క కరోనా కేసు నిర్ధారణ కాలేదని ఆయన అన్నారు. స్వచ్ఛంద సంస్థ వారు పోస్టర్ లో సూచించిన విధముగా ప్రజలు అందరూ వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలి అని కోరారు అని ఆ సంస్థ కన్వీనర్ బి. కె. దుర్గ పద్మజ తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు వెంకటేశ్వరరావు, బంగారయ్య, కోటేశ్వరరావు, సాంబశివరావు పాల్గొన్నారు.

Related posts

సంక్రాంతికి ఊరెళ్తున్నారా.. జరభద్రం!

Satyam NEWS

పుకార్లు నమ్మవద్దు..పుకార్లు పుట్టించవద్దు…

Satyam NEWS

స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల సెంటిమెంట్:ఏపీ ఐఐసీ చైర్మన్ రోజా

Satyam NEWS

Leave a Comment