42.2 C
Hyderabad
May 3, 2024 15: 51 PM
Slider ముఖ్యంశాలు

డేంజర్ బెల్స్: కామారెడ్డిని తాకిన కరోన వైరస్

kamareddy municipality

కామారెడ్డి జిల్లాలో కరోన వైరస్ కలకలం రేపింది. నేడు మధ్యాహ్నం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స కోసం వచ్చిన వ్యక్తికి కరోన వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన 50 సంవత్సరాల వయసున్న రాజయ్య అనే వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టుగా అనుమానిస్తున్నారు.

వారం రోజుల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన రాజయ్యకు జ్వరం, తుమ్ములు ఎక్కువయ్యాయి. కామారెడ్డి లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నేడు మధ్యాహ్నం పరీక్షల కోసం వచ్చాడు. అతనికి టెస్టులు చేయగా కరోనాగా వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే అతన్ని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఎక్కడో ఉన్న కరోన వైరస్ జిల్లాను తాకడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాస్కులు ధరించాలని ప్రభుత్వం చెప్తున్నా కామారెడ్డిలో మాస్కులు దొరకడం కష్టంగా మారింది. ఉన్న చోట 10 రూపాయలు అమ్మాల్సిన మాస్కుని 15 రూపాయలకు ఒకటి విక్రయిస్తున్నారు.

Related posts

11 న ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్లు

Murali Krishna

సమస్యలు తీర్చాలని ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన గ్రామీణ వైద్యులు

Satyam NEWS

విజయసాయిరెడ్డీ అఖిల పక్ష సమావేశంలో ఇవేం మాటలు?

Satyam NEWS

Leave a Comment