తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పై ఏపీ ప్రభుత్వం రాజకీయ వేధింపుల కేసులు పెట్టడం దారుణమని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి కక్షపూరిత కేసులు సమంజసం కాదన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజల మద్దతుతో గెలవాలి తప్ప రాజకీయంగా వేధింపులకు గురి చేయడం సరికాదన్నారు.
చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎమ్మెల్యే సండ్రా వెంకట వీరయ్య ఖండించారు. ఇలాంటి అణచివేత రాజకీయాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు లాంటివన్నారు. ఏపీలో ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే కేంద్రంలోని బిజెపి అండతోనే ఏపీ సర్కారు ఈ రకంగా వ్యవహరిస్తుందని అన్నారు.
కేంద్రంలోని బిజెపి జగన్ మద్దతు పలుకుతూ రాష్ట్రంలో మాత్రం ఖండిస్తున్నట్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో అవినీతి జరగలేదని ఆ సంస్థ ఎండి ప్రకతించారని అన్నారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల పైన ప్రతిపక్షాలు నానా రకాలుగా మాట్లాడుతున్న ఇష్టానుసారం ఆరోపణలు, విమర్శలు చేస్తున్న ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగడం లేదన్నారు. ఏపీలో మాత్రం ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం దారుణం అన్నారు.