40.2 C
Hyderabad
April 29, 2024 18: 13 PM
Slider జాతీయం

నిమ్మగడ్డ కేసులో స్టే ఇవ్వకుండా కెవియట్ దాఖలు

#Supreme Court of India

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఎన్ రమేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వకుండా కెవియట్ పిటీషన్ ను దాఖలు చేశారు. గుంటూరుకు చెందిన కాంగ్రెస్‌ నాయకుడు మస్తాన్‌వలీ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. పంచాయితీరాజ్ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్సు చట్ట విరుద్ధమైనది చెబుతూ రాష్ట్ర హైకోర్టు దాన్ని కొట్టేసిన విషయం తెలిసిందే.

ఆర్డినెన్సును కొట్టేయడంతో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ కనగరాజ్ స్థానంలో ఆటోమేటిక్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ వచ్చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని వైసీపీ నాయకులు చెప్పారు. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా ముందస్తు చర్యగా కెవియట్‌ పిటిషన్‌ వేశారు.

Related posts

హోలీ సంబరాల్లో కలెక్టర్

Murali Krishna

భారత సాధికారికతకు ప్రతీక రిపబ్లిక్ డే!

Satyam NEWS

ఏపి సీఎం జగన్‌కు అమిత్‌ షా ఫోన్‌

Satyam NEWS

Leave a Comment