40.2 C
Hyderabad
April 26, 2024 13: 11 PM
Slider కడప

ఇళ్ల పట్టాల కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు జరపాలి

ameerbabu

ఇళ్ల ప‌ట్టాల‌లో రూ. 4వేల కోట్ల కుంభ‌కోణంపై వెంట‌నే సిబిఐ ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేస్తూ క‌డ‌ప జిల్లా తేదేపా అసెంబ్లీ ఇన్‌చార్జీ అమీర్‌బాబు డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ నివాసంలో ఏర్పాటు చేసిన‌ పత్రిక సమావేశంలో అమీర్ బాబు మాట్లాడారు.

25 లక్షల ఇళ్ల పట్టాల హామీ, తెలుగుదేశం హయాంలో శరవేగంగా పూర్తి చేసుకున్న టిడ్కో ఇళ్ల పంపిణీ విషయంలో… చివరకు టీడీపీ పోరాటాలతో జగన్ సర్కారు దిగొచ్చింది.

తెదేపా చేప్పట్టిన “నా ఇళ్లు నా సొంతం-నా స్థలం నాకు ఇవ్వాలి” కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన రావడంతో వైసీపీ ప్రభుత్వం వెనుకకు తగ్గింది.

టీడీపీ శ్రేణులు ప్రతి గ్రామం/వార్డులో ఈ కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించామని అన్నారు.

టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్తలు నిర్వహించిన నా ఇళ్ళు నా సొంతం-నా స్థలం నాకు ఇవ్వాలి. కార్యక్రమానికి మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

పోరాటాలే ఊపిరిగా పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ… అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నాతెలుగుదేశం పార్టీ ప్రజలతోనే ఉంటుందని మరొక్కసారి స్పష్టమైంది.

ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు న్యాయం జరిగే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని అన్నారు.

మార్చి 25న ఉగాది రోజున ఇవ్వాల్సిన ఇళ్ల పట్టాలను మీ రాజకీయ ప్రయోజనాల కోసం వాయిదా వేస్తూ తెదేపా నేతలు న్యాయస్థానాలలో కేసులు వేయడం వల్లనే పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోతున్నామని జగన్ రెడ్డి & కో ప్రచారం చేసింది.

ఇప్పుడు డిసెంబర్ 25న ఏ విధంగా ఇళ్ల పట్టాలు ఇస్తారు..? ఇన్ని రోజులు కోర్టులో కేసులు వేయడం వల్ల ఆగిందని చెప్పారు. ఇప్పుడు ఆ కేసులు ఏమయ్యాయో జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని నిలదీశారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు హడావుడిగా ఇళ్ల పట్టాలు పంచి రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్న విషయం వాస్తవం కాదా..?

ఇన్ని రోజులు వైసీపీ నేతలు ఇళ్ళ పట్టాల పంపిణీపై చేసిన దుష్ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు చేసిన భూకుంభకోణాలకు సమాధానం చెప్పి ఇళ్ల పట్టాల పంపిణీ చేయాలని సవాల్ విసిరారు.

పేదలను మభ్యపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనే ధ్యాస తప్ప పేదలకు నివాసయోగ్యమైన స్థలాలు ఇచ్చే ఆలోచన చేయకపోవడం నిజం కాదా..?

దశాబ్దాల కాలం నుంచి బడుగు బలహీన వర్గాలు సేద్యం చేసుకుంటున్నభూములను కూడా బలవంతంగా లాక్కొని జీవనాధారం లేకుండా చేసి వందలాది కుటుంబాలను రోడ్డున పడేయడం మీ ధనదాహానికి నిదర్శనం కాదా..?

రివర్స్ టెండరింగ్ ద్వారా వందల కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నామని ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు ఇళ్ల పట్టాల కోసం సేకరించిన భూమిపై రివర్స్ నోటిఫికేషన్ కు ఎందుకు వెళ్ళలేదు..? తక్కువ ధరకు రైతుల నుంచి భూములు సేకరించి ప్రభుత్వానికి అధిక ధరకు అమ్మి వైసీపీ నేతలందరూ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అవుతారని తెలియదా..?

ప్రజలు కోరుకున్న ప్రాంతాల్లో ఇళ్ళ స్థలాలు ఇవ్వకుండా కొండల్లో, గుట్టలో, శ్మశానాల్లో, సుదూర ప్రాంతాల్లో, చెరువుల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిన విషయం నిజం కాదా..?

టీడీపీ హయాంలో కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో పార్టీలు, కులాలు, మతాలు ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం నిజం కాదా..?

తెదేపా హయాంలో నిర్మాణం పూర్తి కాబడిన రెండున్నర లక్షల ఇళ్లను తమకు కేటాయించాలని లబ్ధిదారులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా ఏ ఒక్క రోజూ ముఖ్యమంత్రి స్పందించలేదు

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడటంతో.. ఆఘమేఘాలపైన ఇళ్ల పట్టాల పంపిణీకి సిద్ధమవుతున్నారు

రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వానికి భూములిచ్చిన రైతుల నుంచి వైసీపీ నేతలు రూ.1,400 కోట్ల కమీషన్లు వసూలు చేశారు. వీటికితోడు ఇళ్ల స్థలాలు ఇస్తామని పేదల నుంచి మరో రూ.200 కోట్లు వసూలు చేశారు. ఇది కుంభకోణం కాదంటారా..?

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బిసిలకు 6వేల ఎకరాల భూములు పంపిణీ చేస్తే, జగన్ రెడ్డి ప్రభుత్వం 6వేల ఎకరాలు లాక్కొంది నిజం కాదా..?

కుల మతాలు, పార్టీలకు అతీతంగా పేదలందరికి ఉచితగానే 5 ఏళ్లలో25 లక్షల పక్కా ఇళ్లను కట్టిస్తామని తమ మ్యానిఫెస్టోలో చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఊసెత్తడమే లేదు

ఇప్పటికైనా కక్ష సాధింపులను పక్కన పెట్టి, ప్రజా సంక్షేమానికి పాటుపడండని ఆయ‌న పేర్కొన్నారు.

ఈ సమావేశంలో మాజీ జిపి గుర్రప్ప, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి మాసా కోదండ రామ్ పాల్గొన్నారు.

Related posts

నూతన సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన పువ్వాడ

Satyam NEWS

జోగులాంబ వార్షిక బ్రహ్మోత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం

Bhavani

పశ్చిమగోదావరి జిల్లాలో ఇంటింటికి కుళాయి సౌకర్యం

Satyam NEWS

Leave a Comment