38.2 C
Hyderabad
April 28, 2024 19: 46 PM
Slider శ్రీకాకుళం

డప్పు కళాకారులకు ఆర్థిక సహాయం చేయాలి

dappu

పూర్తిగా ఉపాధి కోల్పోయిన దళిత డప్పు కళాకారులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం డప్పు భరోసా పథకం ద్వారా 20 వేల రూపాయలు ఆర్ధిక సహాయం చేయాలని, అర్హులైన డప్పు కళాకారులకు రైల్వే, బస్ లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, అర్హులైన డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు ఇవ్వాల‌ని, అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని, పెన్షన్ నమోదు కు వెబ్సైట్ ఓపెన్ చేయాలని దళిత డప్పు కళాకారుల సంఘం ఏపీ ప్రభుత్వాన్నిడిమాండ్ చేసింది.

ఈ రోజు ఉదయం 11.30 గంటలకు హిరమండలంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు డ‌ప్పు క‌ళాకారుల ఆధ్వ‌ర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. తహసీల్దార్కి వినతిపత్రాన్ని సమర్పించారు.

ఈ సందర్భంగా దళిత డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. గణేష్, జిల్లా అధ్యక్షులు నిమ్మల సంజీవ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో లాక్డౌన్‌ విధించడంతో పెళ్లిళ్లు, సంబరాలు, జాతరులు, వారాలు, సభలు సమావేశాలు నిషేధించడంతో డప్పు కళాకారులు బ్రతుకులు పూర్తిగా చిధ్ర‌మ‌య్యాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ కాలంలో ప్రధాన ఏకైక ఆదాయ వనరుగా ఉన్న డప్పు కళ పూర్తిగా దెబ్బతిన్నద‌న్నారు. కరోనా వలన చాలా ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతోమందికి ఎన్నో పథ‌కాల‌ ద్వారా ఆర్ధిక సహాయం చేస్తుందని, దళితులు ఓట్లుతో గద్దినెక్కిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దళిత డప్పు కళాకారులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అనేకచోట్ల దళితులు మీద దాడులు జరుగుతుంటే ప్రభుత్వం పొలీస్ యంత్రాంగం అగ్రకులపేతందారులకు కొమ్ముకాస్తూ కేసుకులు నిరుగారిస్తున్నారని తీవ్రంగా ఖండించారు.

ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ముంజేటి రామారావు, మీసాల వెంకట్రావు, ఆరవ ఢిల్లీ, కె అప్పలస్వామి, దుప్పటి ప్రభాస్, బోదల రాజు, పనుకు రాము, కళింగపట్నం త్రినాద్, మానికి రవణ, కలింగపట్ణ యువరాజు, కళింగపట్నం యాకసి, ఇసై రాజాప్పడు, సాకిఅపల్లి కృష్ణ, యలమంచిలి సింహాచలం, ఆళ్ళడా రాము, యల్లమిల్లి బైరగి, మీసాల శివ, మేకార్తి గురువులు, బొమ్మాలి మురళీకృష్ణ, సతివాడ జనార్ధన, సుంకు లక్ష్మణరావు, జమ్మన సుబ్బారావు, బత్తిలి కాంతారావు, కొత్తూరు పారాయ్య, గుబ్బల తవిటయ్య, ముంజేటి దుర్గప్పడు, తుంగన అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పెట్టుబడి-పదవి-సంపాద: ఇదేనా రాజకీయం?

Satyam NEWS

1300 సంవత్సరాల తర్వాత: సూర్యగ్రహణం ప్రత్యేకత ఇదీ

Satyam NEWS

KPHB కాలనీ మూడవ ఫేజ్ లో ఉచిత కంటి చికిత్సా శిబిరం

Satyam NEWS

Leave a Comment