స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన ఒక ట్రేడ్ యూనియన్ నాయుడిపై సిబిఐ పంజా విసిరింది. ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడిని అరెస్టు చేయడంతో ఒక్క సారిగా విశాఖపట్నంలో సంచలనం కలిగింది. స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి యూనియన్ నాయకుడు మంత్రి మూర్తి అనే వ్యక్తి లక్షలు కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఒక నిరుద్యోగి వద్ద నుంచి రెండు లక్షలు డిమాండ్ చేయడంతో అతను సిబిఐని ఆశ్రయించాడు. మంత్రి మూర్తి ఇళ్ళలో, ఆఫీస్ లో సిబిఐ అధికారులు నేడు సోదాలు జరిపారు. పది వేలు లంచం తీసుకుంటుండగా సిబిఐ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మూర్తి ప్రముఖ గుర్తింపు పొందిన యూనియన్ నాయకుడు కావడంతో ఒక్క సారిగా అందరూ ఆశ్చర్య పోయారు. మంత్రి మూర్తిని సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.