29.7 C
Hyderabad
May 2, 2024 06: 30 AM
Slider విజయనగరం

మున్సిపల్ కార్మికుల పై కక్ష సాధింపు ఎందుకు?

#AITUC

రాష్ట్ర ముఖ్యమంత్రికి మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేస్తారని ఎన్నో ఆశలతో అధికారం ఇచ్చిన పాపానికి ఫేస్ రికగ్నైజింగ్ సిస్టం పెట్టి స్మార్ట్ ఫోన్ల ద్వారా మస్తరు విధానం తెచ్చి కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా ఎఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎస్ రంగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ మేరకు విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సుమారు గంటన్నర పాటు ఏ.పి.మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ( ఏఐటీయూసీ అనుబంధ) యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు జలగడుగుల కామేష్ అధ్యక్షతన నిరసన ధర్నా నిర్వహించి ఫేస్ రికగ్నైజింగ్ సిస్టం ద్వారా మస్తరు వేసే విధానం అమలు చేయొద్దని ఎమ్.హెచ్.ఓ వినతిపత్రం సమర్పించడం జరిగింది.

అనంతరం బుగత అశోక్, ఎస్.రంగరాజు లు మీడియాలో మాట్లాడుతూ రాష్ట్రంలో వై.సి.పి. ప్రభుత్వం అధికారంలోకి వస్తే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉద్యోగ భద్రత కల్పిస్తానని, సమాన పనికి సమాన వేతనం ఇస్తానని హామీ యిచ్చిన ముఖ్యమంత్రి ఆ హామీని అమలు తుంగలోకి తొక్కి కార్మికులపై అనేక రకాల యిబ్బందులకు గురిచేసే విధానాలు తీసుకొస్తున్నారని మండిపడ్డారు.

సాధారణ మొబైల్స్ వాడకమే సరిగ్గా తెలియని కార్మికులు నూటికి 80 శాతం మంది ఉన్నారని అన్నారు. ఇలా స్మార్ట్ ఫోన్లలలో ఫోటోలు తీసుకుని ఎఫ్.ఆర్ ఎస్ యాప్ ద్వారా ప్రతి రోజు 4 సార్లు లొకేషన్స్ నందు హాజరు తీసుకోవాలని ఇప్పటికే చాలా మున్సిపల్ కార్పోరేషన్ ల నందు కమిషనర్లు కార్మికులకు హుకుం జారీ చేయడం చాలా దుర్మార్గం అన్నారు. స్మార్ట్ ఫోన్ల వాడకం తెలీని మున్సిపల్ కార్మికులు తమ అటెండెండ్స్ పడుతుందో లేదోననే భయాందోళనల్లో వున్నారు. పైపెచ్చు ఫీల్డ్ లో పనిచేసే కార్మికులకు ఈ ఫేస్ రీడింగ్ సిస్టం సాధ్యం కాదు.

ఇప్పటికే ఇన్స్పెక్టర్ లు,మెస్త్రీలు,సెక్రెటరీలు కార్మికులపై పర్యవేక్షణ ఉన్నది. ఇది కాదన్నట్లు ఈ ఎఫ్ ఆర్ఎస్ మూలంగా అటెండెండ్స్ పడకపోతే వేతనాలకు గ్యారెంటీ లేని ప్రమాదకర పరిస్థితి నెలకొనివుందన్నారు. చాలీ చాలని వేతనాలతో కష్టపడి పనిచేస్తున్న కార్మికులపై ఎ.పి.ఎఫ్.ఆర్.ఎస్ ఫేస్ రికగ్నైజ్ సిస్టమ్ ను తీసుకొని వచ్చి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ఇంకా అనేక రంగాలలో పనిచేస్తున్న కార్మికులకు ఈ విధానం అమలులోనికి తీసుకొని వస్తే వారు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడనుందన్నారు.

ప్రస్తుతం సుమారు 10. నుండి 15 వేలు మధ్యలో 3 లేక 4 నెలలకు ఒకసారి వేతనాలు పొందుతూ నేడు పెరిగిన ధరలతో కుటుంబాలను పోషింకోలేక తీవ్ర యిబ్బందులు పడుతున్న కార్మికులపై యిటువంటి దాడులు చేయడం చాలా దుర్మార్గమన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు కలిపించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో కూడిన ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం 26 వేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. అది చేతకాకపోతే ఇలాంటి చీకటి జీఓ లను రద్దు చేయలన్నారు.

అలాగే గత సమ్మెలో ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్ల మినిట్స్ ను ఇవ్వాలని, చనిపోయిన, రిటర్మెంట్ అయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు తిరిగి పనులు కల్పించాలని,పి.ఎఫ్ లలో నెలకొంటున్న సమస్యలు పరిష్కారం చేయలని అన్నారు. జాతీయ, పండగ సెలవులు, విక్లి ఆఫ్ లు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు.

పెండింగులో ఉన్న యూనిఫామ్లు, సబ్బులు, నూనెలు, గ్లౌజ్ లు ఇవ్వలని డిమాండ్ చేశారు. కార్మికుల పై పని ఒత్తిడి తగ్గించాలన్నారు. వారానికోసారి కార్మికులకి హెల్త్ చెకప్ చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు ఏ.రాములు, మున్సిపల్ కార్మికులు తుపాకుల శ్రీను, దశమంతుల గణేష్, కోడూరు చిరంజీవి, సోమాదుల రాజు, కిషోర్, బండి రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

వనపర్తిలో ఏసీబీకి పట్టుబడిన జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్

Satyam NEWS

ఎల్లూరు భూనిర్వాసితులకు న్యాయం జరగకపోతే ఉద్యమం

Satyam NEWS

అర్ధరాత్రి కస్తూరిబా గాంధీ విద్యార్థినులను పరామర్శించిన మంత్రి

Bhavani

Leave a Comment