38.2 C
Hyderabad
April 29, 2024 14: 38 PM
Slider జాతీయం

జులై 1 నుంచి సీబీఎస్‌సీ 10వ, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు

#CBSE Exams

సెంట్ర‌ల్ బోర్డ్ ఆఫ్ సెంకండ‌రీ ఎడ్యుకేష‌న్ (సీబీఎస్‌సీ) ప‌రీక్ష‌ల తేదీల‌ను సీబీఎస్‌సీ బోర్టు ప్ర‌క‌టించింది. జులై 1వ తేదీ నుంచి జులై 15వ తేదీ వ‌ర‌కు 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని తెలిపింది. దేశంలో క‌రోనా వైర‌స్ సంక్ష‌భం వ‌ల్ల లాక్‌డౌన్ విధించిన సంగ‌తి తెలిసిందే.

దీంతో కొన్ని ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ఆగిపోయింది. లాక్‌డౌన్ విధించిన స‌మ‌యం క‌న్నా ముందు నిర్వ‌హించిన ప‌రీక్ష‌లు కాకుండా 10వ త‌ర‌గ‌తికి చెందిన 90 స‌బ్జెక్టుల్లో మిగిలి ఉన్న‌ 29 స‌బ్జెక్టుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపింది. ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించి ఈశాన్య ఢిల్లీ విద్యార్థుల‌కు మాత్ర‌మే ప‌రీక్ష‌లు జ‌రుగుతాయి. 

12వ త‌ర‌గ‌తికి బిజినెస్ స్ట‌డీస్‌, జియోగ్ర‌ఫీ, హిందీ(కోర్‌) హిందీ(ఎల‌క్టీవ్‌), హోంసైన్స్‌, సోషియాల‌జీ, కంప్యూట‌ర్‌సైన్స్‌(పాత పేప‌ర్‌), కంప్యూట‌ర్‌సైన్స్ (కొత్త పేప‌ర్‌), ఇన్ఫ‌ర్మేష‌న్ ప్రాక్టిస్ ప‌రీక్ష‌లు,   ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ పేప‌ర్‌, బ‌యోటెక్నాల‌జీ నిర్వ‌హించాల్సి ఉంది. 

Related posts

టి ఎస్ ఆర్టీసీ సమ్మెను చట్టవిరుద్ధంగా ప్రకటించలేం

Satyam NEWS

హైదరాబాద్‌లోని జగన్ ఇంటిని ముట్టడించిన భజరంగ్‌దళ్

Satyam NEWS

జగన్ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయిన విజయలక్ష్మి

Satyam NEWS

Leave a Comment