రానున్న రెండు గంటల పాటు నగరవాసులు తమ నివాసాలు లేదా కార్యాలయాల నుండి బయటికి రావద్దని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో మరో గంటా రెండు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రోడ్లు జలమయం కావడానికి అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావచ్చు. రోడ్ల పైభారీగా నీరు నిలిచి ట్రాఫిక్ స్తంభించే అవకాశం ఉంది కాబట్టి రెండు గంటల పాటు జంటనగర వాసులు తమ కార్యాలయాల నుంచి లేదా ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు ఇంజనీర్లు అప్రమత్తంగా ఉంటారు. భారీ వర్షాల హలో ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 13 డిజాస్టర్ రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేశారు. జిహెచ్ఎంసి జోనల్ డిప్యూటీ కమిషనర్ లు ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని లోకేష్ కుమార్ ఆదేశించారు.
previous post
next post