38.2 C
Hyderabad
April 28, 2024 22: 07 PM
Slider పశ్చిమగోదావరి

అవమానభారంతో రోదిస్తున్న దళిత సర్పంచ్

#dalit

దళిత సర్పంచ్ అనే కారణం తో  కుల పరంగా చిన్న చూపు చూస్తూ తనను గార్లమడుగు గ్రామానికి చెందిన ఒక నాయకుడు అడుగడునా అవమానపరుస్తున్నాడని ఏలూరు జిల్లా పెడవేగి మండలం గార్లమడుగు గ్రామ సర్పంచ్ జుజ్జువరపు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ గా తనకు విలువ లేకుండా చేస్తున్నారని ఆయన అన్నారు. మండలం లో ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లినా తాను చెప్పిన పనులు చెయ్యనివ్వకుండా ఆ నాయకుడు అడ్డుపడుతున్నాడని నాగరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారం లేని పదవితో పంచాయతీ  ప్రజలకు ఏమి చేయ లేక పోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రతి గ్రామం లో తన కులాన్ని ఎట్టి చూపిస్తూ తన అనుచరులతో దాడులకు ఉసిగొల్పుతున్నాడని, కుల పరంగా అవమానకరంగా కించపరిచేలా మాట్లాడిస్తున్నాడని సర్పంచ్ నాగరాజు తెలుపుతున్నాడు. ఎం ఎల్ ఏ అబ్బయ్య చౌదరి పిలుపు మేరకు జగనన్న నువ్వే మా నమ్మకం అనే కార్యక్రమం లో పాల్గొనేందుకు పంచాయతీలో వెంకట కృష్ణాపురం వెళ్లి గడప గడపకు జగనన్న సంక్షేమ పథకాలు వివరిస్తుండగా ఒక వ్యక్తి చేత నువ్వెవడవురా మా ఊరు రావడానికి నీకేం పనిరా అనిపించి అతనితో దాడి చేయించాడని తెలిపారు.

దీనిపై పెదవేగి మండల స్థాయి అధికారులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అన్నారు. సర్పంచ్ గా తనకు విలువ ఇవ్వనప్పుడు పంచాయతీ సర్పంచ్ పదవి ఎందుకు అని నాయకులను, అధికారులను ప్రశ్నిస్తున్నాడు. ఈ దుస్థితి పై పెదవేగి మండల అధికారులు, నాయకులు స్పందించి దళిత సర్పంచి నైన తనకు అధికారాలలో మరో వ్యక్తి ప్రమేయం లేకుండా ప్రజలకు స్వతంత్రంగా సేవ సేసుకునే అవకాశం కల్పించాలని గార్ల మడుగు సర్పంచ్ జుజ్జువరపు నాగరాజు వాపోయాడు.

Related posts

కల్పవృక్ష వాహనంపై ఉభయ దేవేరులతో దర్శనమిచ్చిన శ్రీ వేణుగోపాల స్వామి

Satyam NEWS

పిటిషన్: వైసీపీ ప్రజాప్రతినిధులపై ఏపి హైకోర్టు ఆగ్రహం

Satyam NEWS

మాదకద్రవ్యాల కేసులో టీడీపీ సానుభూతిపరుడి అరెస్టు

Bhavani

Leave a Comment