29.7 C
Hyderabad
April 29, 2024 10: 24 AM
Slider ఆదిలాబాద్

స్పెషల్ పార్టీ పోలీసులకు సేఫ్టీ కిట్స్ పంపిణీ

nirmal police 131

మావోయిస్టుల ప్రాబల్యం గల ప్రాంతాలు నిర్మల్ జిల్లాలో ఉన్నందున స్పెషల్ పార్టీ పోలీసులు ప్రత్యేక నైపుణ్యాలు సంతరించుకోవాలని జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు అన్నారు. మావోయిస్టులను తరిమి కొట్టేందుకు అందరూ మ్యాపింగ్, కంపాస్, ఫైరింగ్ లలో మంచి నైపుణ్యత సాధించాలని ఆయన సూచించారు.

ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పెషల్ పార్టీ సిబ్బందితో సమావేశం నిర్వహించి, వారికి స్పెషల్ పార్టీ కిట్ బాగ్, జంగిల్ షూ, జంగిల్ ప్యాచ్ డ్రస్ తదితర వస్తువులను ఎస్పీ అందచేశారు. విధి నిర్వహణ తో పాటు ఆరోగ్యంగా ఉండడం కూడా ముఖ్యమని దాని గురించి ప్రతి రోజు వ్యాయామం, యోగా, శరీర దారుఢ్యం వంటి మంచి అలవాట్లను నేర్చుకోవాలని పోలీసుల్ని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు శ్రీనివాస రావు, వెంకట్ రెడ్డి, డీఎస్పీలు ఉపేందర్ రెడ్డి, నర్సింగ్ రావు, ఆర్ఐలు వెంకటి, కృష్ణ ఆంజనేయులు, ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, యంటిఓ వినోద్, ఆర్ఎస్ఐలు దేవేంధర్, సాయినాథ్, స్పెషల్ పార్టీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారత్ లో చైనా రాయబారిని ఎందుకు మారుస్తున్నది….?

Satyam NEWS

నిత్యావసరాలు అందించిన కాచిగూడా కార్పొరేటర్

Satyam NEWS

సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి

Bhavani

Leave a Comment