32.7 C
Hyderabad
April 26, 2024 23: 16 PM
Slider వరంగల్

మామునూరు ఎయిర్ పోర్టుకు కేంద్రం సూత్రప్రాయ అంగీకారం

ktr 11

వరంగల్ మహా నగరానికి మహర్ధశ రానుంది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద పట్టణంగా అభివృద్ధి చెందుతున్న కాకతీయ వారసత్వ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిచేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి  కేటి రామారావు ఆదేశాలు జారీ చేశారు.

వరంగల్ మహానగరంలోని పెండింగ్ పనులు, భవిష్యత్ ప్రణాళికలపై నేడు అసెంబ్లీ కమిటీ హాల్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మంత్రులు కేటిఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ లు సమీక్ష చేశారు. ఎన్నో రోజులుగా కొనసాగుతున్న కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(కుడా) మాస్టర్ ప్లాన్ కు నేడు కేటిఆర్ ఆమోదం తెలిపారు.

 వరంగల్ ఉమ్మడి జిల్లా నేతల సమక్షంలో మాస్టర్ ప్లాన్ ఫైల్ పై సంతకం పెట్టి కుడా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను ఆమోదించారు. 2020 నుంచి 2041 వరకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్ తో వరంగల్ మహానగర రూపురేఖలు మారిపోతాయని, గొప్ప నగరాల జాబితాలో వరంగల్ చేరుతుందని మంత్రి కేటిఆర్ చెప్పారు.

వరంగల్ కు మంజూరైన 68 కిలోమీటర్ల రింగ్ రోడ్డులో 29 కిలోమీటర్ల రింగ్ రోడ్డు పనులు మే నెల చివరి నాటికి పూర్తి చేసి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ  నాటికి దీనిని ప్రారంభించాలని మంత్రి కేటిఆర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. 

వరంగల్ నగరంలో 15 కిలోమీటర్ల మేరకు మోనో రైలు ప్రతిపాదనలతో పాటు హైదరాబాద్ తరహాలో మెట్రో రైల్ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మామునూర్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు మంత్రి కేటిఆర్ వెల్లడించారు.

కాళోజి కళాక్షేతం, ఏకశిలా పార్క్ నిర్మాణం, జంక్లన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా శానిటేషన్ ప్లాన్, గ్రీనరీ ప్లాన్ , ఎనర్జీ ఆడిట్ పూర్తి చేసి తీసుకురావాలన్నారు. ఎనర్జీ ఆడిట్ లో భాగంగా నగరంలో తుప్పు పట్టిన స్తంబాలు, వంగిన స్తంబాలు, వేలాడే వైర్లు, ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ ఫార్మర్లను వెంటనే తీసేసి కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు.

నగరానికి మాస్టర్ ప్లాన్ మేరకు శానిటేషన్ ప్రణాళికలు సిద్ధం చేసి తీసుకురావాలన్నారు. బడ్జెట్ లో 10 శాతం పచ్చదనం అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో గ్రీనరీ ప్లాన్ రెడీ చేయాలన్నారు. ఉన్న స్మశాన వాటికలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం, కొత్త వాటికోసం స్థలాలు గుర్తించి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు. 

ఈ సమావేశంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి, మండలి సభ్యులు కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి,  ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి నన్నపనేని నరేంద్ర పాల్గొన్నారు.

ఇంకా కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, జిడబ్ల్యు ఎంసి మేయర్ గుండా ప్రకాశ్ రావు, డిఎంఏ సత్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి, ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, కుడా చీఫ్ ప్లానర్ అజిత్ రెడ్డి, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు. 

Related posts

కార్తికేయ నేహా శెట్టి కాంబినేషన్‌లో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ సినిమా ప్రారంభం

Satyam NEWS

ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి సందర్భంగా మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నివాళి

Satyam NEWS

నల్లమల ఆదివాసీలకు పీయూ ఆధ్వర్యంలో ఉచితం వైద్య శిబిరం

Satyam NEWS

Leave a Comment