27.7 C
Hyderabad
April 26, 2024 06: 46 AM
Slider ఖమ్మం

చిరు ధాన్యాల ఆహారం శ్రేష్టం

#bhadradridc

న్యూట్రి గార్డెన్స్ ఏర్పాటుకు నీటి సౌకర్యం లేని అంగన్వాడి కేంద్రాల  జాబితా అందజేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.  అలాగే  చిన్నారులను రక్త హీనత నుండి కాపాడేందుకు మొదటి దశలో చేపట్టిన చిరుధాన్యాలతో కూడిన ఆహారం ఇవ్వడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని, అదే స్ఫూర్తితో 2వ దశలో 1079 అంగన్వాడి కేంద్రాల్లో చిరుధాన్యాలతో కూడిన ఆహారాన్ని అందించుటకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.  జిల్లాలోని అశ్వరావుపేట,  బూర్గంపాడు, దుమ్ముగూడెం,  పాల్వంచ టేకులపల్లి,  దమ్మపేట  ప్రాజెక్టులలో 1079 అంగన్వాడి కేంద్రాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రాల్లో 582 మంది గర్భిణీలు 4 వేల మంది బాలింతలు,  14667 మంది 3 నుండి 6 సంవత్సరాలు చిన్నారులు ప్రతి బుధవారం,  శనివారం చిరు దాన్యాలతో కూడిన  ఆహారం అందించనున్నట్లు చెప్పారు.  రక్త హీనత బారి నుండి చిన్నారులకు కాపాడుకోవడానికి ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగ పడతాయని చెప్పారు. పోషకాలు తో కూడిన ఆహారం అందించుటపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు.  ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ  అధికారి వరలక్ష్మి,  సిడిపిఓలు,  సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఇంటింటా చెట్లు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం

Satyam NEWS

జర్నలిస్టుల మహాసభను  జయప్రదం చేయండి

Satyam NEWS

మహిళా సంఘాల బకాయిలు విడుదల చేయకుంటే ఆమరణ దీక్ష

Satyam NEWS

Leave a Comment