27.7 C
Hyderabad
April 26, 2024 06: 07 AM
Slider రంగారెడ్డి

చర్లపల్లి ఈసీ నగర్‌ లో ఈసీఐఎల్‌ సొసైటి స్థలం కబ్జాకి యత్నం

#ECIL

హైదరాబాద్ శివారులోని చర్లపల్లి ఈసీ నగర్‌లో జిహెచ్‌ఎమ్‌సీ కి చెందిన అత్యంత విలువైన ఎకరం స్థలం కబ్జాకు గురౌతున్నా అధికారులు పట్టించుకోవడంలేదని   కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

25 కోట్ల రూపాయల స్థలం కబ్జాకు గరౌతుందని అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు చేపట్టడంలేదని ఏఎస్‌రావునగర్‌ డివిజన్‌ కార్పోరేటర్‌ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్‌రెడ్డి, టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్‌రెడ్డి బుదవారం కాప్రా సర్కిల్‌ ఏసీపి శ్రీధర్‌ప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్ళారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సదరు స్థలంలో లేఅవుట్‌ చేసి అమ్ముకుంటున్నా అధికారులు చోద్యం చూస్తూ ఉండటం పట్ల నిరసన వ్యక్తం చేశారు. కాప్ర సర్కిల్‌ డిప్యూటి కమీషనర్‌ శంకర్‌ తో పాటు ఏసీపీ శ్రీధర్‌ప్రసాద్‌ ను స్థలాన్ని పరిశీలించి కబ్జాచేసిన వారిపై చర్యలు చేపట్టాలని పట్టుపట్టగా ఏసీపీ శ్రీధర్‌ ప్రసాద్‌ స్థలాన్ని పరిశీలించారు.

ఈ సంఘటనకు సంబందించి చర్లపల్లి ఈసీనగర్‌లో సర్వేనెంబర్‌ 186/4 లోని  78 ఎకరాలు 1990 లో ఈసీఐఎల్‌ ఎప్లాయిస్‌ హౌసింగ్‌ బిల్డింగ్‌ సొసైటీ పేరుతో లేఅవుట్‌ చేసి కాలనీ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా  కాలనీ లో పార్కు కోసం ఎకరం  స్థలం కేటాయించి జిహెచ్‌ఎమ్‌సి కి అప్పగించారని సొసైటీ కార్యదర్శి వి.ఎస్‌ శర్మ తెలిపారు.

ఈ స్థలం ఖాళీగా ఉండటంతో కబ్జాదారుల కన్నుపడిరదని దీంతో సదరు స్థలాన్ని చదును చేసి అమ్మకానికి పెట్టినట్లు వి.ఎస్‌ శర్మ ఆరోపించారు. ఈ విషయమై ఎన్సోసార్లు జిహెచ్‌ఎమ్‌సీ అధికార్లకు ఫిర్యాదు చేసినా గాని పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

స్థలం కోర్టులో ఉందని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, దీంతో పక్కనే ఉన్న ప్లాట్లుపై కబ్జాదారుల కన్నుపడిందని ప్లాట్లలో నిర్మాణాలు జరగకుండా అడ్డుపడుతున్నారని కాలనీకి వాసులు అధికారులకు వివరించారు.

ఎకరం స్థలంతో పాటు ప్లాట్ల యజమానులకు రక్షణ కల్పించాలని వారు కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.

Related posts

వేకువ జామునే సీఎం స‌తీమ‌ణి, ఎమ్మెల్సీ, మంత్రి ఉత్త‌ర ద్వారా ద‌ర్శ‌నం

Sub Editor

మహిళా సాధికారితకు కార్పొరేట్ సంస్థలు సాయం చేయాలి

Satyam NEWS

అతిరథ మహారథుల సమక్షంలో “సేవాదాస్” సాంగ్స్ రిలీజ్ ఫంక్షన్!!

Satyam NEWS

Leave a Comment