30.7 C
Hyderabad
April 29, 2024 03: 42 AM
Slider మహబూబ్ నగర్

రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకున్న చిన్నారులు

#rakhicelebrationsa

మన జీవితంలో ఎన్నో బంధాలు ఉండొచ్చు… కానీ సోదర..సోదరీమణులకు మధ్య ఉండే బంధం చాలా స్పెషల్. ఎన్ని గొడవలు, గిల్లికజ్జాలు పెట్టుకున్నప్పటికీ చివరికి ఇద్దరూ ఒకటై పోతారు. చెల్లి ఆపదలో ఉంటే అన్న ముందు ఉంటాడు. తమ్ముడికి ఇబ్బంది వస్తే అక్క కంగారు పడుతుంది. అలాంటి ప్రత్యేక పండుగ ఇది. వీరు ఒకరిపై మరొకరి ప్రేమను తెలుపుకోవడానికి వీలైన పండగే  రక్షాబంధన్. ఈ  2021 రక్షాబంధన్ పండుగ ను కొల్లాపూర్ ప్రాంతంలో  చిన్నారులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు. 

ఆదివారం రక్షాబంధన్ సందర్భంగా అన్న చెల్లెలు, అక్క తమ్ముడు ఎంతో సంతోషాలతో రాఖీ పండుగను జరుపుకున్నారు. కొల్లాపూర్ ప్రాంతంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరుడు వంగ రాజశేఖర్ గౌడ్ బ్రదర్స్  చిన్నారులైన చిన్నారి అక్కలు చిన్నారి తమ్ములకు  ఎంతో సంతోషంగా రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు  చెప్పుకున్నారు.

అదే విధంగా రిపోర్టర్  అవుట రాజశేఖర్  చిన్నారులైన చిన్నారి చెల్లి  అన్నకు రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు చెప్పుకుంది. చెల్లికి అక్షింతలు వేసి అన్న ఆశీర్వదించారు. కొల్లాపూర్  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి  వ్యక్తిగత కార్యదర్శి చింతకుంట రాఘవేందర్  చిన్నారులు సింగోటం గ్రామంలో చిన్నారి తమ్ముడికి చిన్నారి అక్క రాఖీ కట్టి మిఠాయిలు తినిపించుకొని శుభాకాంక్షలు  చెప్పుకున్నారు. మొత్తం మీద ఈ రాఖీ పండుగ సందర్భంగా చిన్నారులు చెల్లికి అన్న,తమ్ముడికి అక్క ఒకరికి ఒకరు రక్షా అంటూ రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు.

Related posts

చిన్న‌శేష వాహ‌నంపై శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామి

Satyam NEWS

వ్యక్తిని చావబాది.. నోట్లో మూత్రం పోసిన జులాయిలు

Bhavani

నటి సయోనిఘోష్‌ అరెస్ట్‌.. త్రిపురలో బీజేపీ టీఎంసీ వార్

Sub Editor

Leave a Comment