భర్త చనిపోయి నలుగురు పిల్లలతో ఉన్న ఒక మహిళను మానసికంగా శారీరకంగా బాధించిన ఒకడు ఆమె ఎంతకూ లొంగక పోవడంతో యాసిడ్ దాడి చేశాడు. దారుణమైన ఈ సంఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో జరిగింది. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆ మహిళపై అంజి అనే యువకుడు కన్నేశాడు. తన కోరిక తీర్చమని కొంత కాలంగా వెంటపడుతున్నాడు. ఆమె ఎంతకూ అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో ఆమె పొలానికి వెళ్లి తిరిగి వస్తుండగా యాసిడ్ పోసి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన మహిళ ప్రస్తుతం జీజీహెచ్‌లో చికిత్స పొందుతోంది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
previous post