31.2 C
Hyderabad
May 3, 2024 00: 46 AM
Slider ముఖ్యంశాలు

అక్రమంగా సాయం పొందుతున్న పాస్టర్లపై చర్యకు కేంద్రం ఆదేశం

#ChurchPastor

ఎస్ సి, ఓబీసీ సర్టిఫికెట్లు కలిగి ఉండి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రైస్తవ పాస్టర్లకు ఇచ్చే ఆర్ధిక సాయాన్ని కొందరు అందుకుంటున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ లో క్రైస్తవులుగా మతం మారి ఎస్సీ, ఓబీసీ వర్గాలకు అందించే ప్రతిఫలాలను కొందరు పొందుతున్నారు. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.

హిందూ ఎస్ సి, ఓ బిసి సర్టిఫికెట్లు ఉన్న వారిని పాస్టర్లుగా నియమిస్తూ రెండు రకాలుగా వారికి లాభం చేకూరుస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇది కరెక్టు కాదు.

మామూలుగా అయితే ఇది కేంద్రం దృష్టికి వెళ్లేది కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం విపత్తు ఉపశమన నిధి కింద కరోనా కాలంలో నెలకు ఐదు వేల రూపాయలు ఇస్తున్నది.

ఇలా ఇవ్వడం చట్ట వ్యతిరేకమని లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. లాక్ డౌన్ నేపథ్యంలో దేవాలయాలు, మసీదులు, చర్చిలలో మతపరమైన కార్యక్రమాలు చేస్తున్న వారికి ప్రభుత్వం ఐదు వేల రూపాయలు సాయం అందిస్తున్నది.

ఇలాంటి సాయం తీసుకుంటున్న పాస్టర్ల పై ఫిర్యాదు వెళ్లడంతో కేంద్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనిపై ఎలాంటి చర్యలు తీసుకొంటున్నారో కూడా తెలియ చేయాలని కేంద్రం కోరింది.

Related posts

జగన్ కు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదు

Satyam NEWS

ఇంద్రకీలాద్రి ఉత్సవాలకు సిఎంకు ఆహ్వానం

Satyam NEWS

శ్రీశైలంలో కన్నులపండువగా మహాశివరాత్రి  బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

Leave a Comment