27.7 C
Hyderabad
April 30, 2024 07: 31 AM
Slider కడప

అన్నమాచార్య కళాశాలలో పీజీ లకు తాత్కాలిక ధృవపత్రాల ప్రదానోత్సవం

#annamaiahcollege

అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం కొత్త బోయినపల్లి అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో 2021-2023 ఎంబీఏ, ఎంసీఏ డిగ్రీలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు తాత్కాలిక ధృవపత్రాల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ చింతా సుధాకర్, యోగివేమన యూనివర్సిటీ, ఉపకులపతి, వైఎస్సార్ కడప వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల సాధించిన  విజయాల పట్ల తమ హర్షం  వెల్లబుచ్చుతూ విద్యార్థులకు మంచి విద్యతోపాటు క్రమశిక్షణ నేర్పించడం ఎంతో గొప్ప విషయమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వ్యవస్థాపకులు డాక్టర్ చొప్పా గంగిరెడ్డి, వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.ఎంవి నారాయణలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో విలువలు, వైఖరిని బట్టి భవిష్యత్తు నిర్ణయించబడుతుందని తెలియజేశారు. విద్యార్థులకు భవిష్యత్తులో అపజయాలు ఎదురైనప్పుడు ధైర్యం కోల్పోకుండా ముందుకు నడవాలని సూచించారు. అన్నమాచార్య విద్యాసంస్థలు అందిస్తున్న సదుపాయాలను వివరించారు. విద్యార్థులు ఉన్నతస్థానాలను అధిరోహించాలంటే క్రమశిక్షణ, సమయపాలన, సమాజంపట్ల బాధ్యత, మరియు అంకితభావం కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎం మారుతీ ప్రసాద్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ టిఎన్ రంగనాథమ్  వారి బృందం, డీన్స్, వివిధ విభాగాల విభాగాధిపతులు, అధ్యాపక బృందం, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ బి నాగముని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Related posts

కొవ్వాడ అగ్రహారం లో ఫుడ్ పాయిజన్…!

Satyam NEWS

ఆస్రా పోస్టర్ ఆవిష్కరించిన న్యాయమూర్తి

Satyam NEWS

వృద్ధ మహిళను హత్య చేసిన వాలంటీర్

Bhavani

Leave a Comment