29.7 C
Hyderabad
May 3, 2024 04: 10 AM
Slider గుంటూరు

అల్లరి చేస్తున్నది చంద్రబాబు బినామీలే

sajjala 18

అభివృద్ధి వికేంద్రీకరణ కు మద్దతు గా శనివారం పట్టణం లో స్థానిక మ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యం లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు వైస్సార్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తొలుత గుంటూరు రోడ్ ఎమ్మెల్యే నివాసం నుండి ఆర్డీవో కార్యాలయం ఎదురుగా  ఉన్న బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్నారు.

ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి అధ్యక్షత వహించారు. అమరావతి లో జరిగే నిరసనలు ధర్నా కార్యక్రమాలు చంద్ర బాబు బినామీలు, తెలుగుదేశం కార్యకర్తలు మాత్రమే అల్లర్లు సృష్టిస్తున్నారని గోపిరెడ్డి అన్నారు. మూడు రాజధానులకు వ్యతిరేకం కేవలం చంద్రబాబు అనుయాయుల ఆస్తులు కాపాడుకోవటానికి అని విమర్శించారు.

దీనికి సినీనటుడు పవన్ కళ్యాణ్ కూడా తోడు అయ్యాడని విమర్శించారు. తదుపరి హోమ్ మంత్రి సుచరిత మాట్లాడుతూ అమరావతి లో గత ముప్పై ఒక రోజుల గా జరుగుతున్నా నిరసనలు కేవలం టీడీపీ బినామీలు ఆస్తులు కాపాడుకోవటానికే గగ్గోలు పెడుతున్నారని అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనతో చంద్రబాబు కి వచ్చిన నష్టం ఏమిటో చెప్పాలన్నారు. 40 సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు అమరావతి ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నారని సుచరిత అన్నారు.

రాష్ట్ర విభజన అప్పుడు ఎంత బాధ పడ్డామో, ఆ భాధ కలగకూడదని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాలన్నారు. అమరావతి లో నష్టపోయిన రైతులకు ఈ ప్రభుత్వం న్యాయం చేసే దిశా గా అడుగులు వేస్తుంది హోమ్ మంత్రి స్పష్టం చేసారు. ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర దశ దిశా మార్చే విషయం లో పరిపాలన వికేంద్రీకరణ, ప్రజాపరిపాలన గా ముందుకు వెళ్తున్నారని అన్నారు.

జగన్ మోహన్ రెడ్డి ౩౦,౦౦౦ ఎకరాల భూమి అవసరం అవుతుంది అని అన్నారే గాని రైతుల వద్ద నుంచి ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా లాక్కోమని చెప్పలేదని పేర్కొన్నారు. చంద్రబాబు  రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రైతుల దెగ్గర భూమి తీసుకొని డబ్బులు ఖర్చు చేసారని విమర్శించారు.

ఇది ముమ్మాటికీ అధికార దుర్వినియోగమే అని అన్నారు. భవిష్యతులో మూడు ప్రాంతాల మధ్యలో వైషమ్యాలు రాకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అన్నారు. చంద్రబాబు ఐదు ఏళ్ల లో 3 .40 వేళా కోట్లు అప్పు చేశారని సజ్జల విమర్శించారు. గ్రీన్ జోన్ పేరుతో గుంటూరు ,కృష్ణ ప్రజలను చంద్రబాబు మోసం చేశారన్నారు.

తాగునీటి కోసం పల్నాడు ప్రాంత ప్రజలకు నాగార్జున సాగర్ నుంచి బుగ్గ వాగు ద్వారా 9 నియోజకవర్గాలకు తాగునీరు అందించే బృహత్ కార్యక్రమాన్ని చేపట్టారు .ఈ కార్యక్రమ లో అంబటి రాంబాబు ,మంత్రి మోపిదేవి వెంకట రమణ ,గుంటూరు జిల్లా   శాసనసభ్యులు ఆర్కే.,ఉండవల్లి శ్రీదేవి ,విడదల రజని ,ఏసురత్నం ,లెల్ల అప్పిరెడ్డి ,కావడి మనోహర్ నాయుడు ,జంగా కృష్ణ మూర్తి ,మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కు ఘన స్వాగతం

Satyam NEWS

సర్వ మతాలకు ప్రాధాన్యతనిచ్చిన సీఎం

Sub Editor

హ్యాపీ ఫ్రండ్ షిప్ డే: స్నేహమంటే ఇదే కదా…

Satyam NEWS

Leave a Comment