39.2 C
Hyderabad
April 28, 2024 14: 47 PM
Slider నిజామాబాద్

కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీపై మాటల తూటాలు

#gampa

కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ పోటీపై మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి.  నిన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా మరింత దుమారం రేపగా తాజాగా షబ్బీర్ అలీ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గంప గోవర్ధన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాజంపేట మండలం ఆరేపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో గంప గోవర్ధన్ మాట్లాడుతూ.. కేసీఆర్ సొంత గ్రామం కొనాపూర్ అని, అందుకే ఇక్కడినుంచి పోటీ చేస్తే కామారెడ్డి మరింత అభివృద్ధి చెందుతుందని భావించే తాను కేసీఆర్ ను ఆహ్వానించానని తెలిపారు.

పదేళ్లు అధికారంలో ఉన్న నాయకులు తాను ఒడిపోతానన్న భయంతోనే కేసీఆర్ ను కామారెడ్డి నుంచి పోటీ చేయిస్తున్నారని మతిలేని మాటలు మాట్లాడుతున్నారని షబ్బీర్ అలీని ఉద్దేశించి విమర్శించారు. ఏ ఎమ్మెల్యే కూడా తన పదవిని వదులుకుని మరొకరి కోసం పని చేస్తారా అని ప్రశ్నించారు. పదేళ్ల అధికారంలో తన హయాంలోనే అభివృద్ధి జరిగిందని ఆ నాయకుడు చెప్తున్నారని అదే నిజమైతే నాలుగు సార్లు ప్రజలు ఎందుకు ఓడించారని, తన చేతిలో ఎందుకు చిత్తుగా ఒడిపోయారని ప్రశ్నించారు.

ఆయన, ఆయన తమ్ముడు చేసిన మోసాలు ఈ ప్రజలు మర్చిపోలేదని గుర్తుచేశారు. నియోజకవర్గంలో ఏ గ్రామమైన, తండా అయినా వెల్దామని, తాను అభివృద్ధి చేయకపోతే ముక్కు నేలకు రాసి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఈ సవాళ్లపై స్పందన రాదని దెప్పి పొడిచారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ రాకముందే కామారెడ్డిలో ఎన్నికల వాతావరణం నెలకొందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మున్ముందు ఇలాంటి సవాళ్లు, ప్రతిసవాళ్ళు, మాటల తూటాలు ఇంకెన్ని చూడాల్సి వస్తుందోనని సామాన్య ప్రజలు చర్చించుకుంటున్నారు.

Related posts

హైదరాబాద్ లో వరద నివారణకు మాన్సూన్ ఏమర్జెన్సీ బృందాలు

Satyam NEWS

క్రిస్మస్ కు సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి తెలుసా?

Satyam NEWS

సమన్వయంతో సాగుతాం

Bhavani

Leave a Comment