38.2 C
Hyderabad
May 3, 2024 19: 24 PM
Slider ప్రత్యేకం

సిఎం డిజిపికి తెలిసే దాడి జరిగింది: చంద్రబాబు

chandraba

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడి ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి, డిజిపి గౌతమ్ సవాంగ్ కు తెలిసే జరిగిందని మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు అన్నారు. దాడి అనంతరం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఇటువంటి ఘటనలు చూడలేదని చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం రాష్ట్రంలో నడుస్తోందని ఆయన అన్నారు. ఏపీలో ప్రభుత్వం పోలీసులు కుమ్మక్కై దాడులు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతున్నదని, దాడులకు పోలీసులు, ముఖ్యమంత్రి బాధ్యులు అని ఆయన అన్నారు. 100 గజాల దూరంలో డిజిపి ఆఫీసు ఉండి కూడా ఏమీ చేయలేక పోయారు.

నేను డిజిపికి ఫోన్ చేస్తే స్పందించలేదు. ఆర్గనైజ్డ్ గా దాడులకు పాల్పడుతున్నారు. మీరు లాలూచీ పడే దాడి చేయించారు. డిజిపికి,సీఎంకు తెలియకుండా జరిగిన దాడి కాదు అని ఆయన అన్నారు. పార్టి కార్యాలయంపై  దాడి చేసి ప్రతిపక్ష నేతలను చంపాలని చూస్తారా అని చంద్రబాబు ప్రశ్నించారు.

రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. బంద్ కు అందరూ కలిసి రావాలని కోరుతున్నానని ఆయన అన్నారు.

Related posts

ధర్డ్ వేవ్ లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు

Satyam NEWS

పైడిత‌ల్లి ఉత్స‌వ ఏర్పాట్ల‌పై ఆర్డీవో స‌మీక్ష‌

Satyam NEWS

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి మరో ఇద్దరికి గాయాలు

Satyam NEWS

Leave a Comment