26.7 C
Hyderabad
May 3, 2024 08: 08 AM
Slider ఆంధ్రప్రదేశ్

పవన్ కు జనసేన ఎమ్మెల్యే వెన్నుపోటు

pawan and rapaka

జనసేనకు ఉన్న ఒక్క ఎమ్మెల్యే జగన్ తో కలిసిపోయినట్లే కనిపిస్తున్నది. ఇంతకు ముందే తిరుగుబాటు బావుటా ఎగురవేసిన జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇప్పుడు మళ్లీ అదే పని చేశారు. ఒక వైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మూడు రాజధానుల ప్రకటనను వ్యతిరేకిస్తుంటే జనసేన ఎమ్మెల్యే మాత్రం సమర్థిస్తున్నారు. మూడు రాజధానుల నిర్ణయం సబబే అని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ను మాత్రమే అభివృద్ధి చేశారని, నిధుల్ని అక్కడే వెచ్చించి ఇతర ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని తెలిపారు. నవరత్నాలు లాంటి సంక్షేమ కార్యక్రమాలతో జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందన్నారు. మంచి చేస్తే మద్దతు ఇస్తామని… చెడు చేస్తే వ్యతిరేకిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుందని ఆరోపించారు.

Related posts

ఛిల్ ఛిల్ ఛిల్ అంటూ చల్లబడ్డ లంబసింగి

Satyam NEWS

జియోటెక్నికల్, స్ట్రక్చరల్  ఇంజనీరింగ్‌లో పురోగతిపై కార్యశాల

Satyam NEWS

ఒక్క రోజు దీక్ష: వైఎస్‌ షర్మిల అరెస్టు

Satyam NEWS

Leave a Comment