నా సంసారాన్ని చక్కదిద్దాల్సిన నా కన్న తల్లే నా భర్తను పెళ్లిచేసుకుంది అంటూ బ్రిటన్ కు చెందిన ఓ యువతి.వివాహం అనంతరం తనకు ఎదురైన అనుభవాలను లారెన్ వాల్ అనే యువతి ఫేస్ బుక్ లో షేర్ చేసుకోగా, అదిప్పుడు వైరల్ అయింది. చిన్నప్పుడే తన తండ్రి చనిపోయినప్పటికీ తనను తన తల్లి పెంచి వివాహాన్ని ఘనంగా జరిపించింది.
ఆపై మేము హనీమూన్ కు బయలుదేరగా, ఒంటరిగా తన తల్లి జూలీ పాల్ ఎలా ఉంటుందని ఆమెను కూడా తమతో తీసుకుపోయామని ఆ సమయంలో నా భర్త మా తల్లి ప్రవర్తన తేడాగా ఉన్నాఅలా జరుగుతుందా అని ఉరుకున్నానని తానూ గర్భం దాల్చి పండంటి బిడ్డకు జన్మనిచానని లారెన్ తెలిపింది.
నా తల్లి జూలీ నేను నా భర్త వాడే ఉంటున్న నేపథ్యంలో తన తల్లికి అతనికి మధ్య వివాహేతర బంధం ఏర్పడగా, ఆమె తల్లి కూడా మరో బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డకు అల్లుడే తండ్రని ఆమె స్పష్టం చేయడంతో లారెన్ కంపించిపోయింది. కుమార్తె విషయంలో ఇలా చేయడాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నానని, బాధను దిగమింగలేకున్నానని, తల్లిని ఎప్పటికీ క్షమించబోనని లారెన్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొంది. ఆపై తన తల్లి జూరీ, లారెన్ భర్తను వివాహం చేసుకోగా, ఆ పెళ్లికి లారెన్ కూడా హాజరు కావడం కొసమెరుపు.
తన వివాహం 2004లో జరిగిందని, 2005లో తాను, 2009లో తల తల్లి ఒకే వ్యక్తి కారణంగా తల్లులుగా మారామని చెప్పిన లారెన్, 10 సంవత్సరాల పాటు ఈ విషయాన్ని తన మనసులో దాచుకున్నానని చెబుతూ వాపోయింది. లారెస్ స్టోరీ ఇప్పుడు వైరల్ కాగా, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.