38.2 C
Hyderabad
April 29, 2024 11: 02 AM
Slider ముఖ్యంశాలు

డెత్ టోల్: కరోనా ఎఫెక్టు కన్నా ఆవేదన ఎఫెక్టు ఎక్కువ

#Police Voice

కరోనా సోకిందని కంగారుపడి ఆసుపత్రికి వెళితే అక్కడ జరిగేదేమీ ఉండదని ఒక కరోనా పేషెంట్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. కరోనా రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గమని, మందులేని ఈ రోగం కోసం ఆసుపత్రికి వెళ్లినా మనోవేదన తప్ప మరొకటి ఉండదని అతను అనుభవపూర్వకంగా చెబుతున్నాడు.

 కరోనా సోకిందని ఆసుపత్రికి వెళితే అక్కడ డాక్టర్లు దూరం నుంచే మాట్లాడతారని, దగ్గరకు ఎవరూ రారని అతను చెబుతున్నాడు. కరోనా వ్యాధితో కాకుండా మిగిలిన వ్యాధుల కారణంగానే మరణిస్తున్నారని, ఈ మాత్రం మరణాలు కరోనా రాక ముందు కూడా ఉండేవని అతను అంటున్నాడు.

గుండెపోటుతో మరణించేవారు, డయాబెటీస్ తో కిడ్నిలు పాడై మరణించే వారు ఇంతకు ముందు కూడా ఉన్నారని, కరోనా సోకిందనే ఆందోళన కారణంగా ఆ వ్యాధులు ఉన్న వారు మరింత తొందరగా మరణిస్తున్నారని ఈ వ్యక్తి చెబుతున్నాడు.

ఇదంతా జరగకుండా ఉండాలంటే ఇంటి దగ్గరే ఉండి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని, పసుపు వేసిన పాలు తాగాలని చెబుతున్నాడు. అంతే కాకుండా వేడి నీటితో పుక్కిలించడం, వేడినీరు తాగడం వల్ల కరోనా బారిన పడకుండా ఉండవచ్చునని అంటున్నాడు. వేడివేడి ఆహారం తినడం వల్ల, జండూబామ్ లాంటివి వేసుకుని ఆవిరి పట్టుకోవడం వల్ల మేలు కలుగుతుందని అంటున్నాడు.

మధ్యాహ్నం వేళలో డ్రైఫ్రూడ్స్ తినడం, సాయంత్రం వేళల్లో పండ్లు తినడం మంచిదని అంటున్నాడు. మందులేని ఈ రోగం నయం చేసుకోవడానికి ఆసుపత్రికి వెళ్లడం ఎందుకని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఆసుపత్రికి వెళ్లడం కన్నా ఇంట్లోనే ఉండి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, టెంపరేచర్ మరింతగా పెరిగితే పారాసిటమాల్ ట్యాబ్లెట్ వాడాలని చెబుతున్నాడు.

 ఇంట్లో సామాజికదూరం పాటించి ఇంటివారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని అతను సూచిస్తున్నాడు. ఆసుపత్రికి వెళ్లడం అంటే ప్రాణాలు వదులుకోవడమేనని ఈ కరోనా రోగి స్పష్టం చేస్తున్నాడు. అందువల్ల ఎవరి జాగ్రత్తలో వారు ఉండటమే మేలు.

(ఈ మాటలు చెప్పిన వ్యక్తి కరోనా సోకిన ఒక కానిస్టేబుల్. ఇప్పుడు చికిత్స పొందుతూ ఉన్నాడు)

Related posts

భార్యనే మోసం చేసిన ఐపీఎస్ ఆఫీసర్

Satyam NEWS

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ

Satyam NEWS

సుప్రీంకోర్టుపై ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు సరికాదు

Satyam NEWS

Leave a Comment