Slider ప్రత్యేకం

చిట్ ఫండ్ పేరుతో చీటీల వ్యాపారం.. కోట్లకు టోకరా

#cheatingcase

చీటీల పేరుతో చిట్ ఫండ్ కంపెనీ ఏర్పాటు చేసి కోట్ల రూపాయలకు టోకరా వేసినబిచిట్ ఫండ్ నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. కామారెడ్డి పట్టణ ఎస్.హెచ్.ఓ చంద్రశేఖర్ రెడ్డి కథనం ప్రకారం.. అహ్మద్ మొహియుద్దీన్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేపట్టగా కామారెడ్డిలో ఎస్బిఐ బ్యాంకు పైన ఎస్ఎల్వీఎస్ చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరు మీద చిట్టీలు నడిపే కంపెనీని స్టార్ట్ చేశారు.

ఈ కంపెనీలో మోహినోద్దీన్ రెండు చిట్టీలు వేయగా, చిట్టి అమౌంటు మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత కూడా ఇవ్వడం లేదని, మోహినోద్దీన్ లాగే చాలామందికి కూడా చిట్టి ఎత్తుకున్న తర్వాత కూడా డబ్బులు ఇవ్వకుండా మోసం చేసి పారిపోయే ప్రయత్నం చేస్తున్నారని గుర్తించారు.  ఇప్పటి వరకు కామారెడ్డితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన 25-30 మంది బాధితులను గుర్తించడం జరిగిందని, వీరి వద్ద నుండి స్టేట్మెంట్లు రికార్డు చేసి కొన్ని డాక్యుమెంట్లను కలెక్ట్ చేయడం జరిగిందని ఎస్.హెచ్.ఓ తెలిపారు.

కామారెడ్డిలోనే కాకుండా ఆర్మూర్, నిజామాబాద్, కొంపల్లి, సిద్దిపేట, మెదక్, వికారాబాద్, షాద్ నగర్, మెట్పల్లి, వనపర్తి లాంటి ఏరియాలలో ఈ చిట్ ఫండ్ కంపెనీ 10 బ్రాంచ్ లతో ప్రారంభించినట్లుగా ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. అలాగే కామారెడ్డి చుట్టుపక్కల పరిధిలో దాదాపుగా 30 చిట్టీలు వేసిన వ్యక్తులకు సంబంధించి సుమారు రెండు కోట్ల రూపాయల మేర మోసం జరిగినట్టుగా ప్రాథమికంగా గుర్తించడం జరిగిందని తెలిపారు.

ఈ విషయంలో ప్రాథమిక విచారణలో చిట్ ఫండ్ యజమానులు బిల్లా దశరథ్ రెడ్డి ఉపాధ్యాయుడని, అతని భార్య పద్మావతి, కొడుకు నితీష్ రెడ్డిల పేరు పైన చిట్ ఫండ్ కంపెనీ ప్రారంభించారనీ తెల్సిందన్నారు. కంపెనీ యజమానుల నుంచి ఐదు సెల్ ఫోన్లు, ఒక కారుతో పాటు కొన్ని చిట్టిలకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని బాధ్యులైన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం జరిగిందని తెలిపారు. ఎస్.ఎల్.వి.ఎస్ చిట్ ఫండ్ కంపెనీలో చిట్టీలు వేసి మోసపోయిన బాధితులు ఎవరైనా సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

అంగన్వాడీల ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు అక్షరభ్యాసం

Satyam NEWS

హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రి సమస్యలపై వైద్య విధాన పరిషత్ కు వినతి

Satyam NEWS

వదల బొమ్మాళీ నిన్నొదల: ఈటల నెత్తిన మరో పిడుగు

Satyam NEWS

Leave a Comment