Slider ముఖ్యంశాలు

కరెంటు మేమే ఆపాం… ఆ చీకటి వల్లే దాడి జరిగింది

#krantiranatataips

పోలీసులే కరెంటు సరఫరా నిలిపివేయించినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా అంగీకరించారు. చీకటి కారణంగానే సీఎం జగన్ రెడ్డిపై దాడి జరిగిందని కూడా ఆయన అంగీకరించారు. చీకటి కారణంగా దాడి జరుగుతుందని పోలీసులు ముందుగా ఊహించకపోవడమే ఇక్కడ అర్ధం కాని విషయం. సీఎం జగన్ రెడ్డి పై గులక రాయి దాడి కి సంబంధించిన విషయాలను సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ ఆయన వివరించారు.

జగన్‌పై చేత్తోనే రాయిని విసిరారు. నిందితుడు ఎయిర్‌ గన్, క్యాట్ బాల్ వాడారనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. పడిన రాయి కూడా చేతిలో సరిపోయేంత ఉంది. కింద జనాల్లో నుంచే రాయిపైకి విసిరారు. రాయిని చాలా బలంగా, వేగంగా విసిరారు. అందుకే జగన్, వెల్లంపల్లి శ్రీనివాస్‌కు గాయాలు అయ్యాయి. నిందితుడు దొరికితే కుట్రం కోణం తెలుస్తుంది. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తయ్యింది. 307 సెక్షన్ కింద కేసు పెట్టాం అని ఆయన తెలిపారు. ఎనిమిది బృందాలు 40మందితో ఈ కేసు విచారణకు పని చేస్తున్నాయి.

త్వరలోనే కేసును చేధిస్తున్నాం. ఇచ్చిన ఫిర్యాదు, జరిగిన ఘటన ఆధారంగా 307 సెక్షన్ పెట్టాం అని సీపీ మీడియాకు వెల్లడించారు. కరెంట్ వైర్లు తగిలే అవకాశం ఉండటం, రద్దీ రోడ్డులో కరెంట్ వైర్లతో ఇబ్బంది రాకుండా మేమే కరెంట్ చేశాం. అందుకే అక్కడ చీకటి వాతావరణం ఏర్పడింది. ఇదంతా సీఎం భద్రతా కోసం ప్రోటోకాల్‌లో భాగంగానే చేశాం. చీకటి, జనాల రద్దీని ఆసరాగా చేసుకొని నిందితుడు దాడి చేశాడు అని ఆయన వివరించారు.

Related posts

స్వీప‌ర్ల‌ను ఆదుకుంటున్న విజయనగరం పోలీస్ శాఖ‌

Satyam NEWS

బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి

Satyam NEWS

అంతర్వేదిలో ఏపీ మంత్రులకు చేదు అనుభవం

Satyam NEWS

Leave a Comment