27.7 C
Hyderabad
April 30, 2024 07: 36 AM
Slider మహబూబ్ నగర్

అది కొల్లాపూర్ ఎమ్మెల్యే చీప్ పబ్లిసిటీ…

#kollapurmla

ఒకే పార్టీలో ఇద్దరు నాయకులు ఉంటే కార్యకర్తలు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారతారా? అలా జరుగుతుందా? అలాంటి విచిత్ర సంఘటనలు ఇక్కడ జరుగుతున్నాయి. ఒకరిని ఒకరు బలహీన పరచుకునే క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం వికృత రూపం దాలుస్తున్నది. కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో చేరారు.

ఆయనపై టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓడిపోయారు. ఒకే పార్టీలో ఉన్నా నియోజకవర్గంలో ఇద్దరి మధ్య వైరం కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే జూపల్లి కృష్ణారావు రోజు రోజుకూ కార్యకర్తల బలం పుంజుకుంటూ ముందుకు వెళుతున్నారు.

ఈ పరిస్థితిలో ఒక వార్త గుప్పుమన్నది. కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన కొందరు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గం నుండి  ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గంలో చేరారు అనేది ఆ వార్త సారాంశం. వేరే పార్టీ నుంచి కాకుండా అదే పార్టీ నుంచి కార్యకర్తలు నాయకుడిని మార్చిన విచిత్ర సంఘటన గురించి అందరూ చెప్పుకుంటున్నారు. అయితే వీరికి జూపల్లి వర్గానికి సంబంధం లేదు.. ఎమ్మెల్యే పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నాడు అంటున్నారు జూపల్లి కృష్ణారావు ప్రధాన అనుచరులు నర్సాయిపల్లి మాజీ సింగిల్విండో  చైర్మన్, ప్రస్తుత డైరెక్టర్ కొండలరావు, కె.అంజనేయులు,రచూరి ఆంజనేయులు కురువ.

ఎప్పుడు వారు జూపల్లి వర్గంలో పనిచేసిన వారు కాదని, వారికి జూపల్లి వర్గాన్ని సంబంధం లేదని తెలిపారు. వారు మొదటి నుంచి హర్షవర్ధన్ రెడ్డికి పని చేశారని  చెప్పుకొచ్చారు. గతంలో  హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నప్పుడు వారితో  పనిచేశారు. వారే ఇప్పుడు టిఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఎమ్మెల్యే వర్గంలో జాయిన్ అయ్యారు. అంతేగాని అందులో  జూపల్లి వర్గానికి చెందిన వారు ఎవ్వరు లేరన్నారని స్పష్టం చేశారు.

అసలు వారు జూపల్లి వర్గం నుండి చేరికలని ఎందుకు పెట్టుకున్నారో  తెలియదని చెప్పారు. మొన్న ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి  వర్గానికి చెందిన వారు జూపల్లి కృష్ణారావు చెంతకు చేరారు. ఆరోజు కూడా వారు స్వచ్ఛందంగా జూపల్లి కృష్ణారావు సమక్షంలో చేరారని చెప్పారు. అందుకే  ఎమ్మెల్యే పబ్లిసిటీ కోసం గురువారం జూపల్లి వర్గం నుండి ఎమ్మెల్యే వర్గంలోకి కొందరు  వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారన్నారు. సీక్రెట్ గా  సమాచారం సేకరించి ప్రభుత్వానికి అందించే ఒకరి కనుసైగలో ఇదంతా జరిగిందని కొందరి ద్వారా తెలిసింది.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

భక్తుల కోసం మేడారం లో స్టార్ మా తాత్కాలిక గృహాలు

Satyam NEWS

ఎన్నికల వ్యూహాల పై పొంగులేటి, తుమ్మల కసరత్తు

Satyam NEWS

కోర్ట్ డ్యూటీ అధికారులకు ఒక రోజు శిక్షణ

Satyam NEWS

Leave a Comment