29.7 C
Hyderabad
May 3, 2024 03: 55 AM
Slider గుంటూరు

చెంచుల భూముల కొనుగోలుకు సబ్సిడీ నిధులివ్వండి

#navataram party

గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం లో చెంచులు భూములు కొనుగోలుకు గతంలో రూ.1.64 కోట్లు సబ్సిడీ నిధులను విడుదల చేసినా, ఆ తరువాత అధికారులు నిర్లక్ష్యంతో నిధులు వెనక్కి వెళ్లాయి.

చెంచులు వేట,యాచక వృత్తిని వదిలేసుకొని వ్యవసాయం చేసుకునేందుకు గత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నిధులు ఇచ్చినప్పటికీ స్థానిక అధికారులు వెనక్కు వెళ్లేలా చేశారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం అన్నారు.

ఈ విషయాన్ని నేడు ఆయన రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే కు వివరించారు.

స్థానిక ఎమ్మెల్యే విడదల రజనీని కలసి విజ్ఞప్తి చేసినా స్పందించక పోవటంతో ప్రభుత్వ అధికారులు చుట్టూ తిరుగుతున్న చెంచులు మొర ఆలకించాలని విజ్ఞప్తి చేశారు.

2021 బడ్జెట్లో ఎస్టీలకు 6,131 కోట్లు విడుదల అయినందున చెంచులకు భూములు కొనుగోలు చేసి ఇచ్చేందుకు నిధులు విడుదల చేయాలని కోరారు.

అధికారులు తక్షణమే స్పందించారని సమస్యను పరిష్కరించాలని  లేఖను రాస్తామన్నారు. తమశాఖకు రాగానే నిధులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కార్యాలయం కార్యదర్శికి, ట్రైకార్ ఎండి రవీంద్ర బాబు ను కలసి సమస్య గురించి చెంచులక్ష్మి సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ ఆవుల వెంకటేశ్వర్లు, కార్యదర్శి నల్లబోతుల శ్రీనులతో కలసి వినతిపత్రాన్ని అందించారు.

సమస్య పరిష్కరించాలని గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ కు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు రాసిన లేఖ జతపరచినట్లు తెలిపారు.

Related posts

తెలంగాణ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్

Satyam NEWS

మాస్టర్ ప్లాన్ రద్దు చేయకపోతే అగ్నిగుండమే

Satyam NEWS

రాష్ట్రాల గవర్నర్లతో రాష్ట్రపతి వీడియో కాన్పరెన్స్

Satyam NEWS

Leave a Comment