31.7 C
Hyderabad
May 2, 2024 08: 32 AM
Slider ప్రత్యేకం

భారీ వర్షాలకు జిల్లా యంత్రాంగం అప్రమత్తం

#SomeshKumarIAS

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులందరు హెడ్ క్వార్టర్ లోనే ఉండి ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.

ఉద్యోగులకు ఎటువంటి సెలవులు మంజూరు చేయవద్దని, సెలవు దినాలలో ఎటువంటి మినహాయింపు అనుమతులు ఇవ్వరాదని సి.యస్ అన్నారు.

లోతట్టు ప్రాంతాలు, వరద ముంపుకు గురయ్యే ప్రాంతాలపై  ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు. వర్షాలపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని కంట్రోల్ రూం కు పంపాలన్నారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్లను సోమేశ్ కుమార్ ఆదేశించారు.

Related posts

కరప్షన్ స్పెషల్: అంతా ఇంతా కాదు దొరికింది రెండు వేల కోట్లు

Satyam NEWS

మహిళా రిజ్వరేషన్ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి

Satyam NEWS

వనపర్తి అభివృద్ది చూసి ఆనందపడుతున్నా: మంత్రి హరీష్ రావు

Satyam NEWS

Leave a Comment