38.2 C
Hyderabad
April 29, 2024 20: 08 PM
Slider అనంతపురం

కొర్రకోడులో ఘనంగా బాలల దినోత్సవం

#korrakody

స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి, బాలల దినోత్సవాన్ని అనంతపురం జిల్లా కొర్రకోడు ఉన్నత పాఠశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వి పెద్దక్క, వైస్ చైర్మన్ బి గోపాల్, సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్ సతీమణి శివలక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు గొడుగు విజయలక్ష్మి, ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీదేవి, పి చంద్రమౌళీశ్వర, పి ఆదిలక్ష్మి ఏం తిప్పన్న, ఈ.నారాయణ వర దస్తగిరి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని పద్మావతి తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు వేషధారణ నృత్య ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతుల ప్రధానం చేశారు. చైర్మన్ వైస్ చైర్మన్ సర్పంచ్ సతీమణి చేతుల మీదుగా బహుమతులు ఇచ్చారు. తదుపరి జి ఎస్ ఆర్ చక్రవర్తి అడ్వకేట్ పేరు మీద స్వీట్ హాట్ పంచారు. నెహ్రూ జయంతి తోపాటు కీర్తిశేషులు జి ఎస్ ఆర్ చక్రవర్తి (కడప) జయంతి కూడా ఈ రోజే. ఆయన జ్ఞాపకార్థము కూడా విద్యార్ధులకు స్వీట్లు పంచారు.

సత్యం న్యూస్ అనంతపురం

Related posts

కులవృత్తులను ప్రోత్సహించడమే కేసీఆర్ లక్ష్యం

Satyam NEWS

గృహా నిర్మాణ బకాయిలు చెల్లించకుంటే న్యాయ స్థానాలే దిక్కు

Satyam NEWS

జపనీస్ పార్కును సద్వినియోగం చేసుకోవాలి

Bhavani

Leave a Comment