40.2 C
Hyderabad
April 26, 2024 11: 27 AM
Slider ప్రత్యేకం

జపనీస్ పార్కును సద్వినియోగం చేసుకోవాలి

#Japanesepark

ఏఎస్ రావునగర్ లో ఏర్పాటు చేసిన జపనీస్ పార్కును సమీప కాలనీ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి సూచించారు. బుధవారం ఆమె పార్కును సందర్శించారు. ఈ సందర్భంగా పార్కులో ఉన్న నీటి కొలను దుర్గంధ భరితమైన నీటిని ఎయిర్ టేక్ మిషన్ ద్వారా 18 ట్రిప్పుల నీటిని తొలగించారు. పార్కులో విచ్చలవిడిగా పెరిగిన చెట్లను, పిచ్చి మొక్కలను తొలగించారు. పార్కును శుభ్రం చేశారు.

ఈ సందర్భంగా శిరీష సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సందర్శకులు లేకపోవడం వల్ల పార్కు కళావిహీనమైందని అన్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన పార్కును సద్వినియోగం చేసుకోవాలని, వాకింగ్ ట్రాక్ ఇతర పరికరాలు నిరూయోగమవుతున్నాయని అన్నారు. పార్కులో అవసరమైన సౌకర్యాలన్ని కల్పిస్తామని, కాలనీల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ ఎస్ఎఫ్ఏలు, శానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పెండింగ్ కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి

Satyam NEWS

Pakistan Politics: ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు విదేశీ నిధులు

Satyam NEWS

పేద జర్నలిస్టులకు ఘోర అవమానం….?

Satyam NEWS

Leave a Comment