42.2 C
Hyderabad
May 3, 2024 17: 06 PM
Slider ప్రపంచం

భారత్ అగ్ని-5 క్షిపణి పరీక్షలపై చైనా ఆగ్రహం

భారతదేశం అగ్ని -5 క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల ఈ క్షిపణి 5వేల కి.మీ. పరిధిలోని లక్ష్యాలపై సునాయాసంగా విరుచుకుపడగలదు. ఈ క్షిపణి పరిధిలోకి చైనాలోని అనేక నగరాలు వస్తాయి. అందుకే చైనా అగ్ని 5 క్షిపణి పరీక్షలపై వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు తాజాగా చైనా శాంతి.. భద్రత గురించి మాట్లాడటం ప్రారంభించింది.

ఈ క్షిపణి సైన్యంలో చేరిన తర్వాత, అణు సాయుధ ఇంటర్‌కాంటినెంటల్ బాలిస్టిక్ క్షిపణి కలిగిన అత్యున్నత దేశాల్లో భారత్ ఒకటి కానుంది. ప్రస్తుతం, ప్రపంచంలోని రష్యా, అమెరికా, చైనా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, బ్రిటన్, ఉత్తర కొరియా ల వద్దే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి.
చైనాలో భారతదేశం కంటే ఎక్కువ శ్రేణి, ఆధునిక సాంకేతిక క్షిపణులు ఉన్నాయి. చైనా DF-31క్షిపణి 8వేల కి.మీ, DF-41 క్షిపణి 12వేల కి.మీ. పరిధితో ఉన్నాయి.

దక్షిణ ఆసియాలో శాంతి, భద్రత, స్థిరత్వాన్ని కాపాడటంలో ప్రతి ఒక్కరికీ ఉమ్మడి ఆసక్తి ఉందని చైనా పేర్కొంది. అణ్వాయుధాలను మోసుకెళ్లగల బాలిస్టిక్ క్షిపణులను భారత్ అభివృద్ధి చేస్తోందని పేర్కొంది. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (UNSC) రిజల్యూషన్ 1172 లో ఈ విషయంలో ఇప్పటికే స్పష్టమైన నియమాలు ఉన్నాయని చెప్పుకొస్తోంది.

Related posts

నేటి నుంచి వెలిగొండ శ్రీసిద్దేశ్వరస్వామి, భగళముఖి దేవి ఉత్సవాలు

Satyam NEWS

ఎస్‌బీఐ మాజీ చైర్మన్‌ ప్రతీప్‌ చౌదరి అరెస్టు

Sub Editor

ప్రేమించమని వేధించి… కత్తితో దాడి చేసి…..

Satyam NEWS

Leave a Comment