33.7 C
Hyderabad
April 28, 2024 23: 42 PM
Slider ప్రత్యేకం

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ తో చిన జీయర్ స్వామి

#chinajeyarswamy

చీకోటి ప్రవీణ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన పేరు. అతని జూద జల్సాలు అనేకం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. క్యాసినో కింగ్ లాంటి వ్యక్తితో చిన జీయర్ స్వామి కలిసి ఉన్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

గుజరాత్ రాష్ట్ర టెంపరరీ రిజిస్ట్రేషన్ కలిగిన ఒక బీఎండబ్ల్యూ కారులో చినజీయర్ స్వామిని ఎక్కించుకుని, స్వయంగా డ్రైవ్ చేసుకుని వెళ్తున్నట్లు 2021 ఆగస్టు 15వ తేదీన ప్రవీణ్ ఈ వీడియో పోస్ట్ చేశారు. కార్పోరేట్ భక్తి ప్రవచనాలు చెప్పే చిన జీయర్ కు చీకోటి ప్రవీణ్ తో ఉన్న లింక్ ఏమిటి?

గిరిజనుల ఆరాధ్య దేవతలు సమ్మక్క సారలమ్మ జాతరకు వస్తున్న విశేష ఆదరణను చూసి ఆ దేవతలను గ్రామ దేవతలుగా చిన జీయర్ అభివర్ణించారు. చీకోటి ప్రవీణ్ తో ఉన్న చిన జీయర్ ను ఇప్పుడు ఏమనాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.

ఈ సంవత్సరం ఫిబ్రవరి 5న రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ముచ్చింతల్ శ్రీరామ నగరంలో 216 అడుగుల శ్రీ రామానుజాచార్యుల పంచలోహా విగ్రహాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ చే ఆవిష్కరింపజేసి జాతికి అంకితం ఇచ్చిన చిన జీయర్ స్వామి, ఈ దేశానికి అది ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు ఆనాడు ప్రచారం చేశారు.

క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ తో తెర వెనుక ఈ చీకటి కోణం కథేమిటని పలువురు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. రామానుజాచార్యుల పంచలోహా విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమాన్ని మై హోం రామేశ్వరరావు తో కలిసి ఆనాడు అది ఒక బిజెపి పార్టీ సభలా నిర్వహించినట్లుగా తెలంగాణ రాష్ట్ర అధికార టిఆర్ఎస్ శ్రేణులు లోలోన భగ్గు మన్నారు.

ఆనాటి నుండి కోపంగా ఉన్న టిఆర్ఎస్ పార్టీ వర్గాలు చిన జీయర్ ఎక్కడ దొరుకుతాడా అని కాపు కాయగా ఇలా చీకోటి ప్రవీణ్ రూపంలో చిక్కనే చిక్కాడు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు ఇద్దరూ కలిసి బిఎండబ్ల్యూ కారులో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు చీకోటి ప్రవీణ్ లింకులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇంకా ఉభయ రాష్ట్రాల్లో అనేక మంది రాజకీయ, సినీ, వ్యాపార వర్గాల ప్రముఖులు చీకోటి చీకటి దందాలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుండగా, ఇప్పుడు ఒక్కసారిగా చిన జీయర్ స్వామి ప్రమేయం వెలుగులోకి రావడంతో ఇది హాట్ టాపిక్ అయింది. దేశ ప్రధానే చేతిలో ఉండగా చిన జీయర్ కు ఏమీ కాదులే అనే విషయం అందరికీ తెలిసినా ఇలాంటి వ్యక్తులు స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ అంటే బాగా నమ్మే ప్రజలు ఒక్క సారి పునః ఆలోచన చేయడం ఎందుకైనా మంచిది!

తుమ్మలపల్లి ప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్, సెల్: 9912010030

Related posts

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు అభినందనలు

Bhavani

అధికారం ఉంటే ఏదైనా చేస్తారా..?

Satyam NEWS

టుడే స్పెషల్: మురుగు నీరే ఇక్కడి బిర్యానీ సెంటర్ల ప్రత్యేకత

Satyam NEWS

Leave a Comment