కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్డు బిర్యానీ సెంటర్ల వెనుక వీధి మురుగు నీటితో జలమయం అయింది. ఈ విషయమై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. మలమూత్రాల దుర్గంధం, మురుగు నీటి నుంచి వెలువడుతున్న విషయవాయువులు అక్కడ నివశించేవారి జీవితాన్ని దుర్భరం చేస్తున్నాయి. అంతేకాకుండా బిర్యానీ సెంటర్ల నుంచి వెలువడే వ్యర్థాలను వెనుకవైపు ఉన్న పాడైపోయిన కాల్వలోకి వదలడంతో వీటిని తినేందుకు వీధి నిండా పందులు సంచరిస్తూ ఉన్నాయి. పందుల కారణంగా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంది. అదే విధంగా పెరిగిపోతున్న దోమలు, క్రీముల ద్వారా డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలోని చిన్న పిల్లలకు ఎక్కడ అంటు వ్యాధులు సంక్రమిస్తాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.
previous post