28.7 C
Hyderabad
April 28, 2024 04: 06 AM
Slider ప్రపంచం

డ్రాగన్ ఫ్రూట్‌లో కరోనా వైరస్ ఆనవాళ్లు

తాజాగా.. వియత్నాం నుండి దిగుమతి చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్‌లో కరోనావైరస్ నమూనాలను కనుగొన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. దీంతో చైనా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు.. డ్రాగన్ ఫ్రూట్ పై చైనా ఈనెల 26వరకూ నిషేధం విధించింది. వియత్నాం నుంచి డ్రాగన్​ఫ్రూట్​ దిగుమతిని రద్దు చేసింది. ఆ పండు ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆధారాలు లేకపోయినా​ ముందు జాగ్రత్తగా కొనుగోలుదారులు క్వారంటైన్ అవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

అంతేకాదు సూపర్ మార్కెట్లు  మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. డ్రాగన్​ ఫ్రూట్​లో కరోనా ఆనవాళ్లు గుర్తించినట్లు అధికారులు ఇటీవల చెప్పారు.  దేశంలోని జేజియాంగ్, జియాన్జి ప్రావిన్సుల్లోని తొమ్మిది నగరాల్లో వియత్నాం డ్రాగన్​ ఫ్రూట్​లో కరోనా ఆనవాళ్లను అధికారులు గుర్తించారు.

దిగుమతి చేసుకున్న ఆహార ఉత్పత్తులను స్క్రీనింగ్‌ చేసిన సమయంలో ఈ వైరస్ ను గుర్తించినట్లు అధికారులు చెప్పారు. అయితే ఆహారం నుండి కరోనావైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని.. అయినప్పటికీ డ్రాగన్ ఫ్రూట్స్ దిగుమతిపై తాము కొన్ని రోజులు నిషేధం విధించామని తెలిపారు. అంతేకాదు దేశంలోని అనేక ప్రాంతాల్లోని సూపర్​మార్కెట్లను తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు మూసివేయాలని స్పష్టం చేసింది.

Related posts

ప్రభుత్వ ఫించన్ పంపిణీ స్వాహా..! వలంటీర్లపై వేటు..!

Satyam NEWS

వనపర్తిలో ఆసుపత్రులను తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

Satyam NEWS

జగన్ ప్రభుత్వంపై మోదీ అసాధారణ ప్రేమ

Satyam NEWS

Leave a Comment